“అమ్మ బాబోయ్ ఆ పిల్ల మహా ముదురు”.. బన్నీ కూతురు పై సమంత ఊహించని కామెంట్స్.. ఫ్యాన్స్ ఫీలింగ్ ఇదే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “శాకుంతలం”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. రీసెంట్ గానే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనులను కూడా స్టార్ట్ చేశారు శాకుంతలం టీం. కాగా ఈ క్రమంలోనే భాగంగా యాంకర్ సుమతో హీరోయిన్ సమంత ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే సినిమాలో భరతుడి పాత్రలో నటించిన అల్లు అర్జున్ డాటర్ అర్హ పఒ సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే అల్లు అర్జున్ ఎంతటి పెద్ద హీరోనో ఆయన కడుపున పుట్టింది అంటే కచ్చితంగా ఆమెకు కాస్తో కూస్తో టాలెంట్ ఉండనే ఉంటుంది . అయితే ఈ ఏజ్ లోనే అల్లు అర్హత నాన్ననే మించిపోయే లెవెల్ లో పెర్ఫార్మ్ చేసింది అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు . రీసెంట్ ఇంటర్వ్యూలో సమంత కూడా అలాగే పోగిడేసింది.

“చూడడానికి బుడ్డిగా ఉన్నా సరే అల్లు అర్హ చాలా తెలివైన అమ్మాయి ..తెలుగును అనర్కలంగా మాట్లాడగలదు.. ఈ చిత్రంలో భరతుడి పాత్రలో మెరిసిన అల్లు అర్హక్కు భారీ డైలాగులు ఉంటాయి . అంతమంది ముందు గుక్క తిప్పుకోకుండా అంత భారి డైలాగులు చెప్పడం మామూలు విషయం కాదు. అల్లు అర్హ చెప్తుంటే షాక్ అయిపోయాను “అంటూ సమంత చెప్పుకు వస్తున్న టైం లో సుమ మధ్యలో మాట్లాడుతూ ..”ఎవరి కూతురు అక్కడ తగ్గేదేలే “అంటూ డైలాగ్ చెప్పింది. దీనితో సమంత కూడా నవ్వుతూ అవునవును తగ్గేదేలే..

ఇంగ్లీష్ అంటే ఎలా అయినా మాట్లాడేస్తారు . కానీ అర్హ తెలుగు కూడా చక్కగా అనర్గళంగా మాట్లాడుతుంది అంటూ చెప్పి అలాంటి తెలుగు నేర్పించిన అల్లు అర్జున్ స్నేహారెడ్డిలకు హ్యాట్సాఫ్ అంటూ పేర్కొంది. ఈ క్రమంలోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం నాన్ననే మించిపోతుంది ఈ మహా ముదురు పిల్ల ..అంటూ..అల్లు అర్జున్ డాటర్ ఫస్ట్ సినిమాతోనే హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు..!!