“ఆ టెస్ట్ పాస్ అయితేనే మహేశ్ తో సినిమా”.. లాస్ట్ మూమెంట్ లో ఇరకాటంలో పెట్టేసిన రాజమౌళి..!!

మనకు తెలిసిందే ప్రెసెంట్ దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో . కేవలం పాన్ ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా దర్శక ధీరుడు రాజమౌళి పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . దానికి మెయిన్ రీజన్ ఆర్ ఆర్ ఆర్. ఆస్కార్ అవార్డ్స్ లో భాగంగా ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోని ఆ సినిమాలు తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

అయితే ప్రజెంట్ ఇప్పుడు అందరి కళ్ళు రాజమౌళి తర్వాత తెరకెక్కించబోతున్న హీరో మహేష్ బాబు సినిమా పైనే పడ్డాయి . కాగా మనకు తెలిసిందే మొదటి నుంచి రాజమౌళి తన సినిమాకు పకడ్బందీగా ప్లాన్స్ వేస్తూ ఉంటారు . అందరిలాగా పది రోజులు 15 రోజులతో వర్క్ షాప్ ను ఫినిష్ చేయరు . దాదాపు మూడు నాలుగు నెలలు వర్క్ షాప్స్ పెట్టి కంటెంట్ పై సినిమా కథపై చర్చలు జరుపుతూ ఉంటారు . ఈ క్రమంలోనే సినిమాలో పార్టిసిపేట్ చేసే ప్రతి స్టార్ పాల్గొనాల్సిందే.

స్క్రీన్ టెస్ట్ చేయించుకోవాల్సిందే . కాగా ఈ క్రమంలోనే మహేష్ బాబు రాజమౌళి అనుకున్న కథకి సెట్ అవుతాడా లేదా అంటూ ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనట. ఆ తర్వాతే సినిమా పై అఫీషియల్ ప్రకటన వెలువడుతుంది . లేకపోతే రాజమౌళి చెప్పినట్లు ఆసీన్స్ కి తగ్గట్లు సదరు హీరో తన బాడీని మోల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది .ప్రజెంట్ రాజమౌళి – మహేష్ బాబుకు కొంత టైం ఇచ్చాడని.. ఈ క్రమంలోని ఆయన బాడీని మొత్తం మేకోవర్ చేసే విధంగా అన్ని సెట్ చేసుకోవాలని చెప్పుకొచ్చారట.

అంతేకాదు ఈ వర్క్ షాప్ కోసం రాజమౌళి ఏకంగా 20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఈ రేంజ్ లో సినిమా కోసం కష్టపడుతున్నారు అంటే కచ్చితంగా ఈ సినిమా మరో ఆస్కార్ ని తన ఖాతాలో వేసుకోవడం పక్కా అంటున్నారు జక్కన్న ఫ్యాన్స్ . చూడాలి మరి రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో..? ఎన్ని రికార్డులు కొల్లగొట్టబోతుందో..?

Share post:

Latest