మెగా ఫ్యామిలీతో మింగిల్ అవుతున్న మంచు ఇంటి కొత్త కోడలు.. అసలు మ్యాటర్ తెలిస్తే మెంటల్ ఎక్కిపోద్ది..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎంత హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే . రీసెంట్గా మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణుకి మంచు మనోజ్ కి జరిగిన గొడవ సోషల్ మీడియాలో యమ రేంజ్ లో వైరల్ అవుతుంది .

అయితే ఎట్టకేలకు ఈ గొడవపై ఇద్దరు అన్నదమ్ములు స్పందించి మ్యాటర్ ని కూల్ గా సాల్వ్ చేసుకున్నారు . కాగా రీసెంట్గా మంచు మనోజ్ ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో మెరిసారు . సింగిల్ గా కాదు కొత్త భార్యతో కలిపి ఈ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు . అంతేకాదు వీళ్ళిద్దరితోపాటు మంచు లక్ష్మి కూడా పార్టీకి రావడం సంచలనంగా మారింది . మనకు తెలిసిందే గత కొంతకాలంగా మోహన్ బాబుకు మెగాస్టార్ ఫ్యామిలీకు మధ్య గొడవ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఫంక్షన్ కి మంచు మనోజ్ భార్యతో సహా రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

అంతేకాదు ఈ ఫంక్షన్ లో ఏమాత్రం కొత్త పాతా లేకుండా మౌనిక రెడ్డి అందరితో కలిసిమెలిసి మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. మరీ ముఖ్యంగా మెగాకోడలు ఉపాసనతో ఆమె ఎక్కువగా మింగిల్ అయింది అంటూ పార్టీకి వెళ్ళిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసనతో ఎక్కువ మింగల్ అవ్వడం పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి . మెగా ఫ్యామిలీ సపోర్ట్ మంచు మనోజ్ కి అవసరమని.. ఆ కారణంగానే ఇలా భార్యను రంగంలోకి దించాడు అంటుంటే ..మరికొందరు తెలుగుదేశం పార్టీ తరఫున మంచు మనోజ్ ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని ..ఈ క్రమంలోని రామ్ చరణ్ బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ త్వరలోనే టిడిపి తో మింగిల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు. దీంతో మంచు మౌనిక రెడ్డి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!