హవ్వ.. జాన్వీ కపూర్‌కు అసలు సిగ్గు లేదా.. డైరెక్టర్‌తో అంతపనికి దిగజారిపోయిందిగా..!

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకుంది. సినిమాల సంగ‌తేమో కానీ సోషల్ మీడియాలో తన గ్లామ‌ర్ షోతో ఎంతో ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఇప్పుడు త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR 30వ‌ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.

Janhvi Kapoor Spills Beans About Her Personal Life, Reveals If She Ever Made Out In Public

ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మరియు యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాయి. ఈనెల 23న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా మొదలు కాబోతోంది. ఇక ఇప్పుడు తెలుగులోనే కాకుండా సౌత్ లోనే జాన్వీ కి మొదటి సినిమా కూడా ఇదే. ఎన్టీఆర్ 30 తర్వాత ఈ ముద్దుగుమ్మ ఖచ్చితంగా సౌత్ లో బిజీ హీరోయిన్‌గా అవుతుందని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. పైగా ఈ సినిమాపై జాన్వీ కపూర్ కూడా ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంది.

NTR 30: ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ ని అధికారికంగా కన్ఫామ్ చేసిన సినిమా యూనిట్..!! | NewsOrbit

ఈ సినిమా గురించి జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియాలోనే ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమైన హీరో, ఆయనతో నటించే అవకాశం రావాలని దేవుడ్ని ఎంతో ప్రార్ధించేదాన్ని.. ఇక ఇప్పుడు ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుంది. ఆయనకు జంటగా నటించడం నా జీవితంలోనే అతిపెద్ద ఆనందాల్లో ఒకటి అంటూ జాన్వీకపూర్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

అంతేకాకుండా ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటున్నానని తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదల పెడతారు అంటూ రోజు డైరెక్టర్ కొరటాలకు మెసేజులు పెడుతూ ఆయనను విసిగించే దాని అని చెప్పకు వచ్చింది. ఇక ఇప్పుడు జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు నెగిటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు.. ఎన్టీఆర్‌తో న‌టించాల‌నే నీ కోరిక కోసం డైరెక్టర్‌ను అంతలా చిరాకు పెట్టాలా..? అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.. మరికొందరు బాగా అతి చేస్తున్నావ్ అంటూ ఆమెకు చురకలు వేస్తున్నారు.