తొమ్మిదో నెలలోకి అడుగు పెట్టిన పూర్ణ‌.. ఫ్యామిలీ చేసిన పనికి ఉబ్బిత‌బ్బిపోయిన న‌టి!

ప్ర‌ముఖ న‌టి పూర్ణ గ‌త ఏడాది పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో పూర్ణ ఏడ‌డుగులు వేసింది. పెళ్లి అయిన కొద్దిగా నెల‌ల‌కే ఆమె గ‌ర్భం దాల్చింది. తాజాగా పూర్ణ తొమ్మిదో నెల‌లోకి అడుగు పెట్టింది. అంటే మ‌రి కొద్ది రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది.

అయితే తొమ్మిదో నెల రావ‌డంతో పూర్ణ‌ను ఆమె కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారట. తొమ్మిది నెలల గర్భవతి అయిన పూర్ణ కోసం ఆమె త‌ల్లి, సోద‌రి తొమ్మిది రకాల ఇష్టమైన వంటకాలు త‌యారు చేశార‌ట‌. ఆ వంటకాలను పూర్ణకు భర్త అసిఫ్ అలీ ప్రేమగా తినిపించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పూర్ణ త‌న యూట్యూబ్ ఛానెల్ లో ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు.

మొత్తానికి తొమ్మిదో నెల‌లో త‌న ఫ్యామిలీ చేసిన ప‌నికి పూర్ణ ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోయింది. కాగా, కెరీర్ విష‌యానికి వ‌స్తే హీరోయిన్ గా ప‌లు సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు స్టార్ హీరోల సినిమాల్లో స‌హాక పాత్ర‌ల‌ను పోషిస్తోంది. త్వ‌ర‌లోనే పూర్ణ‌, ర‌విబాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన `అసలు` అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 5న ఈటీవీ విన్‌ ఓటీటీలో నేరుగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

Share post:

Latest