ముంబైలో ఇంద్ర భవనం లాంటి ఇల్లు కొన్న సూర్య.. ధర ఎంతో తెలిస్తే షాకే..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగు లో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించారు. ఆయన కేవలం కమర్షియల్ సినిమాలోనే కాకుండా ప్రయోగాత్మక సినిమాలో కూడా నటిస్తుంటారు. హీరోగానే కాకుండా నిర్మాతగా 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య సినిమాలు చేస్తున్నారు. ఇక సూర్య నటించిన సూరారై పోట్రు సినిమాకు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన సినిమాలను హిందీలో రీమేక్ చేయాలని సూర్య అనుకుంటున్నాడుట. అందుకోసం తరచుగా చెన్నై టూ ముంబై ట్రావెల్ చేస్తున్నారని సమాచారం.

అయితే ముంబైకి వెళ్లిన ప్రతిసారి హోటల్స్ లో ఉండడం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ అక్కడ ఏకంగా ఒక ఇల్లునే కొనేసాడు అని కోలీవుడ్ టాక్ నడుస్తుంది. ఆల్రెడీ చెన్నైలో సూర్యకు పెద్ద విల్లా ఉంది. ఇక ఇప్పుడు ముంబైలో కూడా సొంత ఇల్లు కొనేసారట . రిచ్ ఏరియాలో 9000 చదరపు అడుగుల ప్లాట్ ను సూర్య 70 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే ఈమధ్యనే సూర్య తన తండ్రి దగ్గర నుంచి విడిపోయి వేరేగా ఉంటున్నాడట. కాబ్బటి ముంబైలో ఇల్లు కొని అక్కడికి మకాం మార్చేస్తున్నాడు అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే సూర్య తన 41వ సినిమా సెట్స్ మీద ఉంది. శివ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో సూర్య నటిస్తున్న కమర్షియల్ సినిమా ఇదే. దాంతో ఈ సినిమా ఎన్నో ఆశాలు పెట్టుకున్నారు సూర్య. అలాగే విక్రమ్ సీక్వెల్ లో కూడా సూర్య నటిస్తారు. అయితే అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది అనే దానిగురించి అధికారికంగా ప్రకటించలేదు.

Share post:

Latest