మౌనిక గురించి మ‌నోజ్‌ చెప్ప‌గానే మోహ‌న్ బాబు అంత మాట అన్నారా..?

ఇటీవ‌ల మంచు మ‌నోజ్ ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశాడు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే కాగా.. హైద‌రాబాద్‌లోని మంచు ల‌క్ష్మి నివాసంలో మార్చి 3వ తేదీన‌ మ‌నోజ్‌-మౌనిక మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు.

అయితే వీరి పెళ్లి మంచు మ‌నోజ్ తండ్రి మోహ‌న్ బాబుకు ఏ మాత్రం ఇష్టం లేద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని మ‌నోజ్ తాజా వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేశారు. అస‌లు మౌనిక గురించి చెప్ప‌గానే మోహ‌న్ బాబు రియాక్ష‌న్ ఏంటో మ‌నోజ్ వివ‌రించాడు. మార్చి 19న మోహన్ బాబు 71వ పుట్టిన రోజు. తిరుపతిలోని మోహన్ బాబుకి చెందిన శ్రీవిద్యానికేతన్ సంస్థల్లో మోహన్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మనోజ్ స‌తీస‌మేతంగా హాజ‌రు అయ్యాడు. అలాగే ఈ సంద‌ర్భంగా తండ్రి గురించి ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశాడు. `మా నాన్న గారు నాకు అన్ కండీషనల్ లవ్ ఇచ్చారు. నేను కొన్ని వందలసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టాను. అయినాస‌రే ఆయన ప్రేమ మాత్రం తగ్గలేదు. నాన్న నేను భూమా మౌనిక‌ మాటిచ్చాను జీవితాంతం తోడుగా ఉంటానని తొలిసారి చెప్పిన‌ప్పుడు.. ఆయ‌న‌ నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని అన్నారు. మీ అందరికి తెలుసు మౌనికకి తల్లిదండ్రులు లేరు. కానీ మా నాన్న మౌనిక నా మూడో కూతురు అని అన్నారు. ఎన్ని జన్మలెత్తినా ఆయ‌న‌ రుణం తీర్చుకోలేను` అంటూ మ‌నోజ్ చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.