విశ్వక్ సేన్ వింత సెంటిమెంట్.. అది ఉంటే సినిమా సూప‌ర్ హిట్టే అట‌!?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో, డైరెక్ట‌ర్, ర‌చ‌యిత విశ్వ‌క్ సేన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఈ నగరానికి ఏమైంది` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వ‌క్‌.. `ఫ‌ల‌క్‌నుమాదాస్`తో స‌క్సెస్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కల్యాణం ఇలా వ‌ర‌స‌గా విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పుడు విశ్వ‌క్ `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. విశ్వ‌క్ ఇందులో హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం మ‌రియు నిర్మాణ బాధ్య‌త‌లు కూడా తానే తీసుకున్నారు. నివేదా పేతురాజ్ ఇందులో హీరోయిన్ గా న‌టించింది. ఉగాది కానుక‌గా మార్చి 22న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇక‌పోతే విశ్వ‌క్ సేన్ కు ఓ వింత సెంటిమెంట్ ఉంద‌ట‌. అదేంటంటే.. తాను డైరెక్ట్ చేసే సినిమా టైటిల్స్ లో `దాస్‌` అనే పేరు ఉండాల‌ట‌. అలా ఉంటే సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని విశ్వ‌క్ న‌మ్ముతాడ‌ట‌. ఇందుకు ఫ‌ల‌క్‌నుమాదాస్ నిద‌ర్శ‌నం. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ధ‌మ్కీ మూవీకి `దాస్‌` అనే ప‌దాన్ని యాడ్ చేశారు. మ‌రి విశ్వ‌క్ సేన్ సెంటిమెంట్ ఈ సినిమాకు వ‌ర్తిస్తుందా..లేదా.. అన్న‌ది చూడాలి.