ఈ ఏడాది పవన్ కళ్యాణ్ జాతకం అలా ఉందా..!!

ప్రతి ఒక్కరి జీవితాలలో ఉగాది పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది.. శోభకృత్ నామ సంవత్సరం తమకు బాగా కలిసి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే ఇందుకోసం ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత గా పేరుపొంది చాలా కాలం అవుతుంది ఇప్పటివరకు ఎమ్మెల్యే కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan's OG will release in two parts - Hindustan Times
అయితే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ జాతకం ఇలా ఉందంటూ కొంతమంది జ్యోతిష్యులు తమ అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పోటీ చేసిన ఏ చోట కూడా గెలవలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా అన్న సీఎంగా అన్న చూడాలని కోరుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ కల ఎప్పటికి నెరవేరుతుందో అంటే చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. పవన్ జాతకంలో సీఎం అయ్యే యోగం ఉందని కాలం కలిసి వస్తే ఖచ్చితంగా సీఎం అవడం కష్టమేమి కాదని విషయాన్ని కొంతమంది జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు.

జనసేన ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే చాలా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నారు వరుస సినిమాలను ప్రకటిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒకేసారి ఐదు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రోజుకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జాతకం గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.