విజ‌య్‌-స‌మంత ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌.. `ఖుషి` రిలీజ్ డేట్ వ‌చ్చేసిందోచ్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌రకొండ‌, స్టార్ హీరోయిన్ స‌మంత జంట‌గా `ఖుషి` అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. తొలుత గ‌త ఏడాది న‌వంబ‌ర్ లోగా షూటింగ్ పూర్తి చేసి డిసెంబ‌ర్ లో మూవీని రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేశారు. కానీ, కొంత షూటింగ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి సమంత మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డింది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ప‌డింది.

ఈ వ్యాధి నుంచి ఇటీవ‌లె కోలుకున్న స‌మంత‌.. మ‌ళ్లీ ఖుషి షూటింగ్ లో జాయిన్ అయింది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. అయితే తాజాగా విజ‌య్, స‌మంత ఫ్యాన్స్ ను మేక‌ర్స్ స‌ర్‌ప్రైజ్ చేశారు. ఖుషి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల కాబోతోంద‌ని తెలుపుతూ ఓ అదిరిపోయే పోస్ట్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. విజయ్‌ దేవరకొండ ఆఫీస్‌కు వెళ్తూ.. టెర్రస్‌పై సమంతకు బై చెప్తున్నట్లు పోస్ట‌ర్ లో చూపించారు. అయితే ఇద్ద‌రూ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా తెలుస్తోంది. మొత్తానికి ల‌వ్లీగా ఉన్న ఈ పోస్ట‌ర్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.