`ధ‌మ్కీ` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్ తో సంబంధం లేకుండా కుమ్మేసిన విశ్వ‌క్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజాగా `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం మ‌రియు నిర్మాణ బాధ్య‌త‌లు కూడా తానే తీసుకున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది.

వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్ల‌పై కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. సంజ‌య్ రుద్ర అనే డాక్ట‌ర్‌గా, కృష్ణ‌దాస్ అనే వెయిట‌ర్‌గా రెండుపాత్ర‌ల్లో విశ్వ‌క్‌సేన్ చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. కానీ, అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింద‌ని చాలా మంది అన్నారు.

అయితే టాక్ తో సంబంధం లేకుండా విశ్వ‌క్ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేశాడు. పండగ అడ్వాంటేజ్ తో అంచనాలను అన్నీ కూడా మించి పోయి తొలిరోజు ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఏకంగా రూ. 3.06 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 4.08 కోట్లు రాబ‌ట్టింది. ఇక ఏరియాల వారీగా దాస్ కా ధ‌మ్కీ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 91 ల‌క్ష‌లు
సీడెడ్: 43 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 40 ల‌క్ష‌లు
తూర్పు: 30 ల‌క్ష‌లు
పశ్చిమ: 20 ల‌క్ష‌లు
గుంటూరు: 40 ల‌క్ష‌లు
కృష్ణ: 25 ల‌క్ష‌లు
నెల్లూరు: 17 ల‌క్ష‌లు
——————————————
ఏనీ+తెలంగాణ‌= 3.06 కోట్లు(5.85కోట్లు~ గ్రాస్‌)
——————————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 40 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 62 ల‌క్ష‌లు
——————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్‌ కలెక్షన్స్ = 4.08 కోట్లు(8.20కోట్లు~ గ్రాస్)
——————————————-

కాగా, రూ. 8 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మొద‌టి రోజే స‌గం టార్గెట్ ను రీచ్ అయిపోయింది. ఇంకా రూ. 3.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధిస్తే ధ‌మ్కీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వీకెండ్ స‌మ‌యానికి ఈ సినిమా ఖ‌చ్చితంగా లాభాల బాట ప‌ట్టేలా క‌నిపిస్తుంద‌ని సినీ ప్రియులు అంటున్నారు.