నిహారిక‌-చైత‌న్య మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణం అదే.. ఒక్క‌ పోస్ట్ తో క్లారిటీ వ‌చ్చిందిగా!?

మెగా డాట‌ర్ నిహారిక‌, ఆమె భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య విడాకులు తీసుకోబోతున్నారంటూ గ‌త నాలుగు రోజుల నుంచి జోరుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లై మూడేళ్లు కూడా గ‌డ‌వ‌క ముందే వీరి వైవాహిక జీవితం విచ్చిన్నం అయిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక‌రినొక‌రు అన్ ఫాలో అయ్యారు. అలాగే చైత‌న్య త‌న ఇన్‌స్టా అకౌంట్ నుంచి త‌మ పెళ్లి ఫోటోలు మ‌రియు నిహారికతో క‌లిసి దిగిన ఫోటోల‌న్నీ తొల‌గించ‌డం వంటి అంశాలు నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి.

ఇక నిహార‌క‌-చైత‌న్య మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది చర్చనీయాంశం అవ్వ‌గా.. మెగా డాట‌ర్ తాజా పోస్ట్ తో ఆ విష‌యంపై ఓ క్లారిటీ వ‌చ్చింద‌ని అంటున్నారు. త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ఓ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రోమోను నిహారిన త‌న ఇన్‌గ్రామ్ లో పోస్ట్ చేశారు. `డెడ్ పిక్సెల్స్` అనే టైటిల్ తో తెరకెక్కుతున్నఈ ప్రాజెక్ట్ కు నిహారిక నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా ఓ కీల‌క పాత్ర‌ను పోషించింద‌ని ప్రోమోతో స్ప‌ష్టం అయింది.

అయితే గ‌తంలో నిహారిక ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి త‌ర్వాత తాను న‌టించ‌డం చైత‌న్య‌కు ఇష్టంలేద‌ని బ‌హిరంగంగానే వెల్ల‌డింది. భ‌ర్త కోరిక మేర‌కు వివాహం త‌ర్వాత ఆమె సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపించ‌లేదు. కానీ, ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ లో భాగ‌మైంది. అయితే భ‌ర్త మాట‌ కాద‌ని నిహారిక మ‌ళ్లీ న‌ట‌న వైపు అడుగులు వేసింది. ఈ కార‌ణంగానే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చాయి.. అవి పెరిగి పెరిగి ఇప్పుడు విడాకుల వ‌ర‌కు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

https://www.instagram.com/reel/CqFRw4zJ8uL/?utm_source=ig_web_copy_link