నాని టైం ఎంత బ్యాడ్ అంటే.. హిట్ కొట్టిన ఆ సంతోషమే లేకుండా చేసారుగా..!?

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది గంటల ముందే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. గత కొంతకాలంగా హిట్ కోసం అల్లాడిపోతున్న నాని .. ఈ సినిమా లక్ ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి . రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో ప్రతి థియేటర్లో హౌస్ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి . ఈ క్రమంలోనే నాని చాలా రోజుల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు .

అయితే కధ పరంగా కంటెంట్ పరంగా సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకున్న దసరా సినిమాపై కొందరు కావాలని నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు . చాలామంది నాని సినిమా బాగుంది అంటూ చెప్పుకొస్తుంటే ఎక్కడో కొంతమంది జనాలు నాని సినిమాకి అంత సీన్ లేదని.. ఇదంతా పుష్ప సినిమాని కాపీ కొట్టి తీసిన కథ అంటూ ట్రోల్ చేస్తున్నారు . థియేటర్స్ నుంచి బయటికి వచ్చిన పలువురు జనాలు కూడా ఇదే ఫీలింగ్ ని ఎక్స్ ప్రెస్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు పుష్ప సినిమాను చూసే ఈ సినిమాను కాపీ కొట్టారు అంటూ కొన్ని మీమ్‌స్ కూడా ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే నాని సినిమా ఇన్నాళ్ల తర్వాత హిట్ టాక్ సంపాదించుకుందని.. ఆ సంతోషం ఆయనకు లేకుండా చేసేసారు కొందరు ట్రోలర్స్. దీంతో ప్రజెంట్ నాని సినిమా పుష్ప సినిమాకి కాపీనా..? అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి . దీంతో నాని సినిమా పై పలు నెగటివ్ రివ్యూలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం..!!