ఆ పాట పాడి అందర్నీ స్టన్ అయ్యేలా చేసిన కీర్తి సురేష్ తల్లి..

నేచరల్ స్టార్ నాని హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా దసరా. శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఇక సంతోష్ నారాయణన్ విభిన్న ట్రాక్లతో కూడిన అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్‌ను స్కోర్ చేశారు. ఈ సినిమాలోని చమ్కీల అంగిలేసి పాట ఫుల్ గా వైరల్ అవుతుంది. పెళ్ళిలో భార్యాభర్తలు ఒకరితో ఒకరు సరసాలు, గిల్లికజ్జాలు ఆడడాన్ని, ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకునే దాన్ని చూపించే అత్యంత అందమైన పాట ఇది.

 

ఇందులో భార్య పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన భర్త ఎలా దుస్తులు ధరించేవాడో, పెళ్లయిన కొత్తలో ఎలా వుండేవాడో, ఆ తరువాత కొంత కాలానికి ఎంత నిర్లక్ష్యంగా మారిపోయాడో చెబుతూ పాడే పాట ఇది. అలానే నాని కూడా దానికి తగ్గట్టుగా తన భార్యపై అలాంటి వాదనలే ఈ పాటలో వినిపిస్తాడు. ఈ పాట ప్రతి భార్యాభర్త రిలేట్ చేసుకునే ఉండటంతో సోషల్ మీడియాలో బాగా హిట్టైంది. అంతేకాకుండా ఈ పాట తెలంగాణ స్లాంగ్‌లో ఉండటంతో, మరీ ముఖ్యంగా తెలంగాణ వాసులు ఎక్కువగా ఈ పాటను వింటున్నారు.

ఇక చమ్కీలా అంగీలేసి పాటలో నాని దసరా బుల్లోడులా కనిపించగా, కీర్తి సురేష్ ఏమో చీరలో అందంగా కనిపించింది. శ్రీరామనవమి సందర్బంగా ‘దసరా’ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఈరోజే గ్రాండ్ గా రిలీజ్ చేసారు. సోషల్ మీడియాలో అక్కచెల్లెల్లు, అత్తా కోడళ్లు, భార్య భర్తలు ఇలా వయసుతో సంబంధం లేకుండా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. ఈ పాటకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించడంతో ప్రమోషన్ ఈవెంట్లలోనూ నాని, కీర్తి ఇద్దరూ ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్‏ను ఆకర్శించారు. ఈ పాటను కీర్తి సురేష్ తల్లి కూడా పాడారు.