క‌ళ్యాణ్ రామ్ కు ప్ర‌మాదం.. ఆసుపత్రికి తరలింపు.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న అప్ కమింగ్ మూవీ `డెవిల్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా వైజాగ్‌లో ఏకంగా ఐదు వంద‌ల మంది ఫైటర్స్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా.. క‌ళ్యాణ్ రామ్ ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని తెలుస్తోంది.

క‌ళ్యాణ్ రామ్ మీద ఫైట్ చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి దెబ్బ గాయం అయింద‌ట‌. దాంతో వెంట‌నే క‌ళ్యాణ్ రామ్ ను స‌మీపంలోని హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించ‌గా.. అక్క‌డి వైద్య‌లు ఆయ‌న‌కు చికిత్స అందించార‌ట‌. ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ క‌ళ్యాణ్ రామ్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

కానీ అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో క‌ళ్యాణ్ రామ్ స్వ‌ల్ప గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డార‌ట‌. ఆయ‌న ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేద‌ని తెలుస్తోంది. కాగా, డెవిల్ విషయానికి వ‌స్తే.. ఇదొక పీరియాడిక్ స్పై థ్రిల్లర్. శ్రీకాంత్ విస్సా అందించిన క‌థతో నవీన్ మేడారం ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బ్రిటిష్ గవర్నమెంట్ లోని భారత ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్లు, ప్రోమోలు సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేశాయి.