సమంత కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రముఖ నటి సమంత, అక్కినేని నాగచైతన్యతో కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఇక ఇటీవలే మరోసారి విడాకుల విషయం గురించి స్పందించి వార్తలలో నిలిచింది. నాగచైతన్యను నిందించేలా సమంత వ్యాఖ్యలు చెయ్యడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ మధ్య సమంత ఎక్కడ చూసినా కళ్లద్దాలు పెట్టుకొనే కనపడుతుండటంతో అందరూ స్టైల్ కోసం అని అనుకుంటున్నారు. కానీ సమంత మాత్రం ఆరోగ్య సమస్యల వల్ల కళ్లద్దాలు వాడుతుందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కళ్లు ఎక్కువ వెలుతురుని చూడలేకపోతున్నాయట. అందుకే కళ్లద్దాలు ధరిస్తున్నానని సామ్ చెప్తుంది. తాజాగా తన లుక్స్ గురించి వస్తున్న కామెంట్లపై సామ్ స్పందించింది. “ఆరోగ్య సమస్యల వల్ల ఒక్కోసారి ఒక్కో లుక్ లో కనిపించాల్సిన పరిస్థితి వస్తుంది. అయిన నా లుక్స్ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడిన వాటిని నేను పట్టించుకోను” అని ఆమె చెప్పుకొచ్చింది.

మయోసైటిస్ వ్యాధి వల్ల, మెడికేషన్ వల్ల కొన్నిసార్లు ఆమెపై ఆమెకి కంట్రోల్ ఉండడం లేదట. కొన్నిసార్లు సామ్ బొద్దుగా కనిపిస్తుందట, మరి కొన్నిసార్లు నీరసంగా కనిపిస్తుందట. ఈ వ్యాధి వాల్ల ఆమె కళ్లు వెలుతురుని తట్టుకోలేని పరిస్థితి వచ్చిందని, మరే నటికి ఇలాంటి బాధ రాకూడదని సమంత అభిప్రాయం వ్యక్తం చేసింది. గత కొన్ని నెలలుగా మయోసైటీస్ వ్యాధితో పోరాటం చేస్తున్నానని, ఎంతో బాధపడుతున్నానని ఆమె కామెంట్లు చేశారు. ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టానికి తగిన రెమ్యునరేషన్ ఇవ్వాలని సమంత తాజాగా కామెంట్లు చేసింది. ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో బిజీ గా ఉంటుంది.