చేయకూడని తప్పు చేస్తున్న చరణ్.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ రామ్ చరణ్ ప్రజెంట్ ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకుంటున్నాడో మనందరికీ తెలిసిందే . ఆయన లాస్ట్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగిపోతుంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు ..హాలీవుడ్ మీడియాలోనూ రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న చరణ్ కి ఎలాంటి హ్యూజ్ రెస్పెక్ట్ దక్కిందో మనందరికీ తెలిసిందే . కాగా ప్రెసెంట్ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయిన సందర్భంగా..RRR టీం అమెరికాలో సందడి చేస్తుంది .

ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ సైతం అమెరికాలోనే ఉన్నాడు . కాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పనులు పూర్తి అయిపోగానే చరణ్ వెంటనే వచ్చి ఆర్సి 15 సినిమా షూటింగ్స్ లాస్ట్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు . ఈ క్రమంలోనే ఆర్సి 15 సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అప్పుడెప్పుడు సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన చిత్ర బృందం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి అప్డేట్ ఇవ్వలేదు . సోషల్ మీడియాలో మాత్రం ఆర్సి 15 కి సంబంధించిన పలు పిక్స్ వైరల్ అవుతున్నాయి . అయితే ఈ క్రమంలోనే రీసెంట్గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో లీక్ అయింది.

ఆర్సి 15 సినిమాకి చరణ్ “ఛ్ ఏ ఓ” ఓ అనే టైటిల్ ని పెట్టబోతున్నాడట . ఈ క్రమంలోనే ఈ సినిమాల్లో రామ్ చరణ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా కూడా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రజెంట్ ఏపీలో ఎలాంటి పొజిషన్లో కొంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిరంజీవి రాజకీయాల్లోకి రాను అని చెప్తున్నా కొందరు పనిగట్టుకుని రాజకీయాలకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు . ఒకవేళ నిజంగా చరణ్ ఈ సినిమాలో రాజకీయాలను టచ్ చేస్తే గనుక కచ్చితంగా అది మెగా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసమే రాంచరణ్ ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ జనాలు పుకార్లు పుట్టించే ఛానెస్ ఎక్కువగానే ఉన్నాయి .

ఈ క్రమంలోనే చరణ్ చేయకూడని తప్పు చేస్తున్నాడని ..తన వల్ల పవన్ కళ్యాణ్ కి నష్టం వాటిల్లే ప్రయత్నం చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . మరోపక్క నిజంగా రాంచరణ్ ఈ సినిమాలో అలా అలాంటి పాత్రలో కనిపిస్తే కచ్చితంగా ఏపీ ప్రభుత్వం సినిమాకి పెట్టరాని రూల్స్ పెట్టి సినిమాకు లాస్ అయ్యేవిధంగా చేసుకొస్తుంది అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఏది ఏమైనా సరే చరణ్ ఫస్ట్ టైం ఎలక్షన్స్ జోనర్ ని టచ్ చేస్తూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

Share post:

Latest