లంగా వేసుకుని..జాకెట్ బటన్స్ తీసేసిన స్టార్ హీరో..ఈ అరాచకం ఏందిరా నాయన..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రకరకాల వింతలు , విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి తగ్గట్టే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా రెచ్చిపోయి మరి ఫోటో షూట్ చేస్తున్నారు ముద్దుగుమ్మలు . కేవలం హీరోయిన్స్ కూడా అంతే ..అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు . కాగా రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ప్రజెంట్ అక్షయ్ కుమార్ అమెరికా టూర్ లో ఉన్నారు . అది కూడా ఈవెంట్ కోసం అక్కడికి వెళ్లారు. అక్కడ ఏ షో జరిగిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అక్షయ్ కుమార్.. ఎంటర్టైనర్ పేరుట వివరిస్తున్న ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు . కాగా అక్షయ ఒక్కరే కాదు ఈ కార్యక్రమంలో పలువురు బడా బాలీవుడ్ స్టార్స్ కూడా పాల్గొంటున్నారు . నూర ఫతేహి, సోనమ్ భాజ్వ, మౌని రాయి, దిశ పటనీ.. లాంటి హాట్ బ్యూటీ లు కూడా ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. అయితే ఈ టూర్ లో భాగంగా అక్షయ్ తో పాటు మిగిలిన వారు డాన్స్ ప్రోగ్రాంలు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అట్లంటాలో డాన్స్ షోలో ఆడి పాడి చిందులేసాడు అక్షయ్ కుమార్ . ఈవెంట్లో అక్షయ్ కుమార్ చేసిన డాన్స్ వీడియో ప్రజెంట్ బాగా వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా వీడియోలో అక్షయ్ కుమార్ లంగా లాగా ఉన్న స్కర్ట్ వేసుకొని పైన ఉన్న జాకెట్ బటన్స్ విప్పేసి.. ఆ లంగాలోనే మై ఖిలాడి తూ ఆనారి పాటకు విచ్చలవిడిగా డాన్స్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే అంతటి పెద్ద బాలీవుడ్ స్టార్ ఇలా లంగా కట్టుకునే డాన్స్ వేయడం పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . నెటిజన్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మరికొందరు బూతులు తిడుతున్నారు . ఈ క్రమంలోని అక్షయ్ కుమార్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

Share post:

Latest