Natural Star Nani : హీరో నాని నోట పచ్చి బూతు పదమా..? ఫ్యాన్స్ ఫైర్..!!

నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా నటిస్తున్న సినిమా దసరా . కెరియర్లోనే ఫస్ట్ టైం మాస్ యాంగిల్ లో కనిపించబోతున్న నేచురల్ స్టార్ నాని ..ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . అంతకు ముందు నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమాలు భారీ దెబ్బేసిన సంగతి తెలిసిందే. రొటీన్ సినిమా అంటూ బోరింగ్ కంటెంట్ అంటూ చాలామంది ఓపెన్ గానే చెప్పారు. అంత ఎందుకు నాచురల్ స్టార్ నాని ఫాన్స్ కే ఆ సినిమాలు నచ్చలేదు . దీంతో తన రూట్ మార్చేసిన నాని ఈసారి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు .

కాగా దసరా సినిమాతో పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ చేసిన నాని సినిమాలో తెలంగాణ యాస మాట్లాడి అభిమాన్లను అట్రాక్ట్ చేశారు . మరి ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల మధ్య సాగే కథ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అంటూ స్వయానా నాని నే చెప్పకు వచ్చాడు . సినిమా టీజర్ లో నాని తెలంగాణ యాసలో మాట్లాడి స్పెషల్ అట్రాక్షన్ సంపాదించుకున్నాడు. దీనికి విశేష స్పందన లభించింది .

అయితే రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఓరి నారి పాట ఈవెంట్లో నానికి చేదు అనుభవం ఎదురయింది . ఈ సినిమా టీజర్ లో నాని తెలంగాణలో “బాంచత్” అనే పదాన్ని వాడాడు. అప్పట్లో జనాలు పెద్దగా పట్టించుకోలేదు . కానీ ఈవెంట్లో రిపోర్టర్ “అలాంటి పదం వాడడం తప్పు కాదా..?” అంటూ ప్రశ్నించాడు .ఈ క్రమంలోనే నాని “అది జనరల్ గా వాడే పదం అని అలా వాడడంలో ఎలాంటి తప్పు లేదని ..ఈ పదాన్ని అందరూ వాడొచ్చని స్కూల్ పిల్లలు కూడా నేర్చుకోవచ్చు “అంటూ కామెంట్స్ చేశాడు . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నాని పేరు వైరల్ అవుతుంది. ఇలాంటి వాడివా నాని నువ్వు అంటూ కొందరు ఆయన్ని ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు . దీంతో నాని పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది..!!