మా బాబాయ్ అలాంటివాడే..బాలయ్య కి ఎమోషనల్ విషయాన్ని షేర్ చేసిన రామ్ చరణ్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో అదరగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్‌గా ప్రభాస్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాగా ఏకంగా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి.. అంతలా బాలయ్య షో కి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు టాలీవుడ్ లోనే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్- బాలయ్య తొలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఎపిసోడ్ కోసం చేసే హంగామా ఎంతో తారాస్థాయికి చేరింది.

Unstoppable with NBK | Nandamuri Balakrishna, Pawan Kalyan | FH - YouTube

పవన్- బాలయ్య ఫ్యాన్స్ నిరీక్షణకు తెర దించుతూ తొలి ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ మొదలైంది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య- పవన్ కళ్యాణ్ గురించి సంచలన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ప్రభాస్ ఎపిసోడ్ తరహాలోనే ఈ ఎపిసోడ్ లో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఫోన్ కాల్ చేసారు బాలయ్య.. ఆ ఫోన్ కాల్ లో చరణ్ ని బాలయ్య నువ్వు మీ నాన్న దగ్గర లేనప్పుడు మీ బాబాయితో జరిగిన ఓ పెద్ద సీక్రెట్ ఏమిటి అని ప్రశ్నించగా.

ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ చరణ్ ఓ సెన్సేషనల్ అండ్ ఎమోషనల్ ఇన్సిడెంట్ ని బాలయ్యతో పంచుకున్నాడు. ‘తనకి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కళ్యాణ్ బాబాయ్ తో కలిసి సింగపూర్ వెళ్లాను.. అక్కడ మాతో నాన్న, అమ్మా ఎవరూ లేరు ఇక దీంతో బాబాయ్‌తో కలిసి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ పిజ్జాలు, బెర్గర్ లు ఇష్టం వచ్చినట్టు తినేసా’.. ‘ఇక అవి తేడా కొట్టి ఒకచోట విపరీతమైన వాంతులు అయ్యాయి.. ఆ సమయంలో కళ్యాణ్‌ బాబాయ్.. నేను చూసుకున్న వాంతులను నన్ను తన చేతులతో క్లీన్ చేసేవాడు.. ఈ విషయాన్ని రామ్ చరణ్ బాలయ్యతో పంచుకున్నాడు’.

ఇక చిన్నప్పుడు రామ్ చరణ్ ని, సాయిధరమ్ తేజ్ ని పెంచి పెద్ద చేసింది పవన్ కళ్యాణ్ ఆట.. ఇక వారికి సటైన్ ఏజ్ వచ్చేవరకు పవన్ కళ్యాణ్ నే వారిని దగ్గరుండి చూసుకున్నాడట. రామ్ చరణ్ ఎప్పుడైనా చెప్పిన మాట వినకపోతే చిరంజీవి అతని పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపేవారట. దీంతో పవన్ క్లాస్ పీకటం హితబోధ చేయడం జరిగేది. ఇక మీ బాబాయ్ డేటు లైవ్ విధానం ఎలా ఉంటుందని బాలయ్య- రామ్ చరణ్ ని ప్రశ్నించగా.. ‘ఆయన లైఫ్ చాలా బోర్ గా ఉంటుందని చరణ్ ఫన్నీ కామెంట్ చేశాడు’. ఇక ఈ ఎపిసోడ్ లోనే సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా మధ్యలో జాయిన్ అవుతాడు.