కె. విశ్వనాథ్‌ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకైపోతారు!?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సినీ దిగ్గజం, ప్రముఖ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. గురువారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయిందంటూ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఐదు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసిన కె. విశ్వనాథ్.. త‌న చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు. దర్శకుడుగా కె. విశ్వనాథ్ ఎన్ని చిత్రాలు రూపొందించినా, ఆయనకు ‘కళాతపస్వి’ అన్న పేరును సంపాదించి పెట్టింది ‘శంకరాభరణం’ చిత్రం. 1980 ఫిబ్రవరి 2న విడుదలై ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. విశ్వ‌నాథ్ కు ఎన్నో అవార్డుల‌ను, రివార్డుల‌ను తెచ్చిపెట్టింది.

తన కెరీర్ ని అద్భుతమైన స్టేజీకి తీసుకెళ్లిన సినిమా విడుదలైన రోజే కళాతపస్వి కన్నుమూశారు. ఇక‌పోతే తెలుగు జాతి ఖ్యాతి ని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు త‌న కెరీర్ లో 50కు పైగా సినిమాను దర్శకత్వం వహించారు. ఆస్తుల‌ను కూడా బాగానే సంపాదించారు. జూబ్లీహిల్స్‌ లో కె. విశ్వ‌నాథ్ కు రూ.12కోట్ల విలువైన ఇల్లుతో పాటు హైదరాబాద్‌ శివార్లలో ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఆయన స్థిర, చర ఆస్తులు కలిపి దాదాపు రూ.120కోట్లకు పైగా ఉంటాయని అంచ‌నా వేస్తున్నారు.