ఆ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ అర్చన..!!

తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అర్చన. ఈమె కెరియర్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ అందం, అభినయంతో మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది అర్చన. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు సైతం తెలియజేసింది. కొంతమంది హీరోలు గురించి మాట్లాడుతూ అర్చన ఈ విషయాలను తెలియజేసినట్లుగా తెలుస్తోంది

Archana Shastry Age, Family, Husband, Movies, Biography - Breezemasti
అర్చన మాట్లాడుతూ మొదట రాధాగోపాలం చిత్రంలో అవకాశం వచ్చిందని ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం వల్ల తనకు హీరోయిన్గా అవకాశం పోయిందని అర్చన తెలియజేస్తోంది. ఆ సినిమాలో కనుక నటించి ఉంటే తన గ్రాఫ్ అద్భుతంగా ఉండేదని తెలియజేసింది. అర్చన కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి హీరోగా సక్సెస్ అయ్యారు.. నేను మాత్రం అలా కాలేకపోయానని తెలియజేసింది అర్చన. తెలుగువాళ్లు నేను ఎక్కడికి వెళ్లినా కూడా తనకు ఆఫర్లు రావాలని చెబుతారని తెలిపింది. యమదొంగ సినిమాలో కూడా అవకాశం వస్తే నేను చాలా ఆనందించాను.

Hot and happening Archana Shastry (Veda) gets engaged to a businessman -  IBTimes India

యమదొంగ మూవీ తనకు ప్లస్ అయిందని తెలిపింది. ప్రస్తుతం వెరైటీ రోల్స్ అయితే వస్తున్నాయని రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర అంటే తనకు బాగా ఇష్టమని తెలిపింది. ఇండస్ట్రీలో అమ్మాయి వీక్ గా ఉంటే ఆ అమ్మాయి మైండ్ క్యాప్చర్ చేయడానికి చాలామంది ఉంటారని అర్చన తెలిపింది. ఒక హీరో తనకు తెలియకుండా తన గురించి కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారని తెలిపింది.. అలా ఇచ్చిన హీరోది వంకర బుద్ధి అంటూ తెలిపింది. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో అందంగా ఉన్న అమ్మాయిలను కొంతమంది హీరోలు ట్రాప్ చేస్తూ ఉంటారని తెలిపింది. అలాంటప్పుడే మనకి ఏది మంచిది ఏది చెడు అనే విషయం తెలుసుకొని మెలగాలని తెలిపింది అర్చన.