ఆ చిన్న తప్పే అనుష్క పాలిట శాపంగా మారిందా..? శని పక్కన ఉంటే అంతేగా మరి..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం మామూలు విషయం కాదు ..ఎంతో కృషి ..పట్టుదల..అంతకన్నా ఎన్నో కమిట్మెంట్స్ ఇవ్వాలి . అవన్నీ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగ గలమా అంటే నో అని చెప్పాలి. బీభత్సమైన లక్ రాసిపెట్టి ఉంటేనే స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీలో ఏలేసేయొచ్చు. అలాంటి లక్ కి మరో మారుపేరుగా చెప్పుకునే అనుష్క సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారడమే కాదు.. నెంబర్ వన్ హీరోయిన్గా తన స్థానాన్ని సంపాదించుకుని రాజ్యమేలేసింది.

అనుష్క పేరు చెప్తే అప్పట్లో స్టార్ హీరోలు కూడా తమ సినిమాలో అవకాశం కల్పించే అంత పాపులారిటీ సంపాదించుకుంది అనుష్క శెట్టి. మరీ ముఖ్యంగా తెరపై నాగార్జున – అనుష్క ….ప్రభాస్ – అనుష్క జంట జోడి కడితే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయాల్సింది. అలాంటి ఓ క్రేజీ పేరు టాక్ సంపాదించుకుంది . అయితే ఒకే కంటెంట్ చేయకూడదు అనే నిర్ణయంతో అనుష్క శెట్టి డిఫరెంట్ ఉన్న పాత్రను చూస్ చేసుకుంది . ఈ క్రమంలోనే వేదం , సైజ్ జీరో సినిమాల్లో నటించింది .

అయితే ఎప్పుడైతే అనుష్క తన కెరీర్ హీరోయిన్గా కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టిందో అప్పుడే అనుష్క కెరియర్ పతనం మొదలైంది. అనుష్క తీసుకున్న బ్రాడ్ నిర్ణయం ఆమెకు కోల్కోలేని షాక్ ఇచ్చింది. నాచురల్ గా ఉండడానికి బరువు పెరగడానికి బీభత్సంగా ఫుడ్ తినేసి వెయిట్ వచ్చేసిన అనుష్క అప్పటినుంచి ఇప్పటివరకు వెయిట్ తగ్గలేక పోతుంది. సినిమా రిలీజ్ అయి సంవత్సరాలు అవుతుంది . అయినా ఇంకా అనుష్క వెయిట్ తగ్గలేదు . ఈ క్రమంలోనే స్టార్స్ కూడా అనుష్కతో సినిమా చేయడానికి ఇష్టపడడం లేదు . ఇలా స్టార్ హీరోయిన్గా రాజ్యమేలాల్సిన అనుష్క ఒకే ఒక్క తప్పు కారణంగా ఇండస్ట్రీలో కనుమరుగైపోతుంది . ఎక్కడో అరా కొరా అనుష్క ఫ్యాన్స్ తప్పిస్తే హీరోయిన్ గా ఇండస్ట్రీలు అనుష్క పేరు జపించే నాధుడే లేడు..!!

Share post:

Latest