“వీర సింహా రెడ్డి Vs వాల్తేరు వీరయ్య” : ఎవరు హిట్..ఎవరు ఫట్..?

హమ్మయ్య .. ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫైట్ కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోస్ నందమూరి బాలయ్య అలాగే మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి . ఈ క్రమంలోని సినిమా రిలీజ్ అయ్యే రెండు నెలల ముందు నుంచి సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది . మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అవుతుంది అంటే కాదు కాదు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమానే హిట్ అవుతుందని ..మెగా-నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ తోనే సోషల్ మీడియాని షేక్ చేశారు.

ఫైనల్లీ ఎట్టకేలకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి రెండు సినిమాలు పాజిటీవ్ టాక్ దక్కించుకున్నాయి . అయితే కలెక్షన్స్ పరంగా ..కంటెంట్ పరంగా.. జనాల రివ్యూలు పరంగా.. ఏ సినిమా జనాలకు బాగా నచ్చింది.. ఏ సినిమాలో మైనస్లు ఉన్నాయి ..అనేది సోషల్ మీడియాలో ఓపెన్ గా చెప్పేస్తున్నారు జనాలు. ఈ క్రమంలోని బాక్సాఫీస్ వద్ద రియల్ సంక్రాంతి హీరోగా విన్ అయ్యాడు నందమూరి బాలయ్య అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

వీర సింహారెడ్డి తో కంపేర్ చేస్తే వాల్తేరు వీరయ్యలో పెద్దగా చెప్పుకోతగ్గ కంటెంట్ లేదని.. మొత్తం డ్రగ్స్ మాఫియా కిందనే నడిచిందని ..మాస్ మహారాజ రవితేజ – చిరంజీవి మధ్య వచ్చిన డైలాగ్స్ కొంచెం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిస్తే.. శృతి చిరు మధ్య జరిగిన రొమాంటిక్ సీన్స్ సినిమాకి మరి కొంచెం హైప్ ఇచ్చాయని ..అది తప్పిస్తే సినిమాలో చెప్పుకోతగా ప్లస్ లు ఏమీ లేవంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా వీరసింహారెడ్డి విషయానికి వచ్చేసరికి సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది తమన్ మ్యూజిక్ ..ఆ తర్వాత డైలాగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ..కధ పరంగా కంటెంట్ పరంగా వవీరసింహారెడ్డి సినిమా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది .అంతేకాదు రీసెంట్గా రిలీజ్ అయిన కలెక్షన్స్ లో కూడా వీరసింహారెడ్డిని పై చెయ్యి లో ఉంది . ఈ పరంగా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ రియల్ విన్నర్ వీరసింహారెడ్డినే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..!!