సొంతం సినిమా హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది… అసలు గుర్తుపట్టలేరు??

2002లో ఆర్యన్ రాజేష్, రోహిత్, సునీల్, నమిత, నేహా పెండ్సే మెయిన్ రోల్స్‌లో నటించిన ‘సొంతం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన నేహా పెండ్సే అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సొంతం తరువాత ఈ ముద్దుగుమ్మ 2003లో గోల్‌మాల్ అనే తెలుగు సినిమాలో నటించింది. 2008లో వీధి రౌడీలో కనిపించి అలరించింది. ఇవి రెండు ఫ్లాప్స్ కావడంతో ఆమెకు అవకాశాలు రావడమే మానేసాయి.

అలా ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయింది. ఆమె తెలుగులో నటించక 15 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో అందరూ ఆమెను మర్చిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఫొటోలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. సొంతం సినిమా హీరోయిన్ నేహా పెండ్సే అంటూ ఆమె ఫొటోలైతే వైరల్ అవుతున్నాయి కానీ ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె అంతలా మారిపోయింది, మరి.

 

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

నేహా తెలుగులో అవకాశాలను దక్కించుకోలేకపోయినా హిందీ, మరాఠి సినిమాల్లో చాలా అవకాశాలను పొందింది. 2012 నుంచి 2022 వరకు హిందీ సీరియల్స్ లో కూడా నటిస్తూ యాక్టింగ్ రంగానికి ఎప్పుడూ దూరం కాలేదు. 2018లో బిగ్‌బాస్ 12లో కూడా పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 18 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. 24 ఏళ్ల వయసులో తెలుగులో సొంతం సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు 39 ఏళ్లు.

 

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

అయితే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఈ భామ కనిపించడం లేదు. అంటే ఆమె బాగా లావు అయిందని, అందవిహీనంగా మారిందని కాదు. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ సన్నగా నాజూగ్గా చాలా అందంగా ఉంది. నిజానికి అప్పటికంటే ఇప్పుడే ఈ తార తన హాట్ గా సెక్సీ గా ఉంది. తాను తరచుగా సోషల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఆమె ఫోటోలు వీడియోలు చూస్తే ఈ విషయాన్ని ఎవరైనా ఒపుకోవాల్సిందే. ఏదేమైనా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు విజయవంతంగానే తన కెరీర్ నడుపుతుందని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ బ్యూటీ అందాలను ఆస్వాదించేందుకు టాలీవుడ్ ఫ్యాన్స్ ఆమె ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేయవచ్చు.