మనకు తెలిసిందే గత పదేళ్లుగా మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన గుడ్ న్యూస్.. రీసెంట్ గానే ఫాన్స్ కు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . మెగా కొడలు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ..తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చారు . అప్పటినుంచి సోషల్ మీడియాలో ఉపాసన – రాంచరణ్ లకు సంబంధించిన ప్రతి న్యూస్ వైరల్ అవుతుంది .
కాగా ఇదే టైములో వాల్తేరు వీరయ్య సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ అక్క సుస్మిత పుట్టబోయే మెగా వారసుడు గురించి సంచలన కామెంట్స్ చేసింది . సుస్మిత మాట్లాడుతూ ..”రాంచరణ్ తండ్రి కాబోతున్నాడు అని తెలిసిన మరో క్షణం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ స్పెషల్ మూమెంట్ కోసం కొన్నేళ్ళుగా వెయిట్ చేస్తున్నాం . ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసింది .
అయితే రామ్ చరణ్ కి పాప పుట్టినా.. బాబు పుట్టినా.. ఓకే కానీ నేనైతే అబ్బాయి పుట్టాలని అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు . కొడుకు పుడితే మాకు బాగుంటుంది . ఆ కోరిక తీరిపోతుంది…” అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే అంతటి పెద్ద స్టార్ డాటర్ అయి ఉండి నువ్వు కూడా కామన్ పీపుల్ లా ఆలోచిస్తావా ..? పాప అయినా బాబు అయినా.. నేటి జెనరేషన్ లో ఒకటే అంటూ సుస్మిత వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు. దీంతో మెగా డాటర్ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!