శ్రీ‌లీల దెబ్బ‌కు భారీగా న‌ష్ట‌పోతున్న స్టార్ హీరోయిన్స్‌.. పాపం ఎంత క‌ష్ట‌మొచ్చింది?!

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో మారు మోగిపోతున్న పేరు ఇది. తెలుగులో ఈ అమ్మడు చేసింది రెండే చిత్రాలు. అందులో ఒకటి `పెళ్లి సందడి` కాగా.. `ధ‌మాకా` మరొకటి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అయితే తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రీలీల.. రెండో సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అటు స్టార్ హీరోలకు, ఇటు యంగ్ హీరోలకు మోస్ట్ అవాంటెడ్ బ్యూటీగా మారిపోయింది.

ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకి జోడిగా `ఎస్ఎస్ఎమ్‌బీ28`లో ఎంపికయింది. అలాగే బాలకృష్ణకు కూతురుగా అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే `ఎన్‌బీకే 108` లో నటించబోతోంది. వీటితో పాటు నితిన్ తో `జూనియర్`, నవీన్ పోలిశెట్టితో `అనగనగా ఒక రాజు`, వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా, రామ్ పోతినేనితో ఓ సినిమా చేసేందుకు కామెంట్ అయింది. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ రెండేళ్లకే చేతినిండా ప్రాజెక్టులతో టాలీవుడ్ ను ఏలేస్తుంది.

ఇక ఈ అమ్మడు దెబ్బకి స్టార్ హీరోయిన్లు భారీగా నష్టపోతున్నారని టాక్ నడుస్తోంది. నేడు టాలీవుడ్ లో ఒక్కో స్టార్ హీరోయిన్ నాలుగు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ను తీసుకుంటున్నారు. కానీ శ్రీ‌లీల కేవలం కోటి రూపాయలకే నిర్మాతలకు కాల్ షీట్స్ ఇచ్చేస్తుంది. పైగా గ్లామ‌ర్, న‌ట‌న‌, డ్యాన్స్ వంటి అంశాల్లో శ్రీ‌లీల‌కు వంద మార్కులు ప‌డిపోయాయి. ఫలితంగా రోజురోజుకీ ఆమెకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో స్టార్ హీరోయిన్స్ చేసేదేమీ లేక తమ రెమ్యునరేషన్ను భారీగా తగ్గించుకుంటున్నారట. ఇలాగైనా ఆఫర్లు వస్తాయని వారు ఆశపడుతున్నారట. మొత్తానికి శ్రీలీల‌ కారణంగా స్టార్ హీరోయిన్లకు పెద్ద కష్టమే వచ్చి పడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.