మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్‌ ట్విస్ట్‌తో వచ్చి సూపర్ హిట్టైన టాలీవుడ్ సినిమాలు ఇవే..!

ప్రస్తుతం వచ్చే ప్రేమకథ సినిమాలన్నిటిలో క్లైమాక్స్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ వారి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటే.. మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ లేదా హీరో చనిపోతారు. మరొకరు ఒంటరిగా మిగిలిపోతారు. చాలావరకు సినిమాలన్నిటిలో కూడా ఇదే జరుగుతుంది. అయితే ఉప్పెన సినిమా క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా చిత్రికరించారు దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా రిలీజ్ అయిన తొలి రోజుల్లో కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ తరువాత మంచి కలెక్షన్స్ రాబట్టింది.

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమా క్లైమాక్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబుని విలన్ గా చూపిస్తారు. కానీ అసలు విలన్ ఎవరు అనేది చివర్లో తెలియగానే ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూసాం అని హ్యాపీతో థియేటర్స్ నుంచి బయటికి వచ్చారు.

కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో కూడా డైరెక్టర్ అజయ్ భూపతి అదిరిపోయే క్లైమాక్స్ తో సినిమాని ఎండ్ చేసారు. ఈ సినిమాలో పిల్లారా అనే పాట సినిమా రిలీజ్ కాకముందే మంచి హిట్ అందుకుంది. కార్తికేయ తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ యే విలన్ అని తెలిసి హీరో చనిపోవడం చూసి ఆడియన్స్ భావోద్వేగానికి గురి అవుతారు.

ఏ హడావుడి లేకుండా చాలా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’. ఈ మూవీ క్లైమాక్స్‌ ఎవరూ ఊహించని రీతిలో చాలా అద్భుతంగా ఉంది ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నాలుగు కథలు ఉండగా.. అవన్నీ ఒక వ్యక్తికే చెందినవని లాస్ట్‌లో మాత్రమే తెలుస్తుంది. ఆ ట్విస్ట్ చాలా బాగుండి ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది.