బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ దాదాపుగా నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీరో సినిమాతో బాద్ షా జీరో అయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో విమర్శలు చేసిన వారికి సమాధానంగా పఠాన్ సినిమాతోనే చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పఠాన్ సినిమా పైన ఉన్న నమ్మకంతో తన మార్కెట్ ఇతర విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాతలను సైతం రిస్కులో పెట్టకూడదని ఉద్దేశంతోనే షారుఖ్ ఖాన్ కేవలం ఈ సినిమా కోసం రూ.40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం.
ఒకవేళ లాభాలు వస్తే వాటిలో మెజారిటీ వాటాను తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను దాదాపుగా రూ.250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమై బాగానే రాబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఈ సినిమా బాయ్ కాట్ నినాదం ట్రెండ్ అవుతున్నప్పటికీ మరొకవైపు అడ్వాన్స్ బుకింగ్ పరంగా పలు రికార్డు స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటివరకు కొన్ని లక్షల టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
షారుక్ ఖాన్ కు జోడిగా ఈ సినిమాలో దీపికా పదుకొనే నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు వల్ల కూడా ఈ సినిమా మంచి పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా పలు విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా దీపికా పదుకొనే బికినీ వివాదం ఈ సినిమాకు అడ్వాన్సుగా మారిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఈ రేంజ్ లో ఉంటే మరి సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.