“ఇక పై నా లైఫ్ లో ఆ రెండూ ఉండవు”.. అందరిని ఆకట్టుకుంటున్న #Nani30 గ్లింప్స్(వీడియో) ..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఏ విషయం నైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాడు. కాంట్రవర్షియల్ కం టెంట్ జోలికి అసలు వెళ్ళడు. కాగా తన సినిమాల విషయంలోనూ ఇదే రూల్ ని పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాడు . రీసెంట్గా అలాగే సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్ వార్డ్ గా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశాడు. మనకు తెలిసింది నిన్న న్యూ ఇయర్ సందర్భంగా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన నాని ..అభిమానులకు ఇచ్చిన మాట తప్పకుండా కొద్దిసేపటి క్రితమే తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశాడు .

గత కొంతకాలంగా నానితో మృణాల్ టాకూర్ నటిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ వార్తలను నిజం చేస్తూ నాని ఈ సినిమాలో మృణాల్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధపడ్డాడు . కాగా ఎప్పటిలాగే నాని కొత్త కంటెంట్ , కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొత్త దర్శకుడుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు నాని. శౌర్యువ్‌ అనే యంగ్ డైరెక్టర్ ఈమూవీని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా నాని 30 సినిమాకి సంబంధించిన అఫీషియల్ గ్లింప్స్ వీడియోను షేర్ చేశాడు.

ఈ సినిమా గ్లింప్స్ ఆధారంగా ..ఇది తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలకు సంబంధించిన సినిమా అని క్లియర్గా అర్థం అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాని స్పెషల్ లుక్స్ హైలెట్ గా మారాయి . ఈ సినిమా గ్లింప్స్ ఆధారంగా ..” దసరా సినిమా గెటప్ లో ఉన్న నాని చూసి డాడీ ని గడ్డం నాకు నచ్చలేదు అంటుంది పాప . ఈ క్రమంలోనే నాని దసరా కోసం నాన్న అయిపోవచ్చిందిలే ..మన సినిమాకి ఈ గడ్డం ఉండదు అంటాడు . అప్పుడే పాప వచ్చి మరి మీసం నానా అంటుంది . అప్పుడు నాని ..మీసం కూడా ఉండదు .. మరి జుట్టు అనగానే పాప .. నాని సరే నీకోసం జుట్టు కూడా అంటాడు..అప్పుడే పాప వద్దులే డాడీ ఉంచుదాం అంటూ ప్రేమగా నవ్వేస్తుంది”.

కాగా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ గ్లింప్స్ లో లో హైలెట్ గా మారింది . అంతేకాదు కచ్చితంగా నాని ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటాడు అంటున్నాడు నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్. ఏది ఏమైనా సరే కూల్ అండ్ క్లాసిక్ సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో నాని తర్వాతే ఎవరైనా అంటున్నారు అభిమానులు . చూడాలి మరి తండ్రి కూతుర్ల రిలేషన్షిప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో . మరి ఎందుకు ఆలస్యం ఆ గ్లింప్స్ లో మీరు ఓ లుక్ వేయ్యండి..!!