కొత్త సంవత్సరంలో న్యూ లైఫ్ స్టార్ట్..పెళ్ళి చేసుకోబోతున్న ప్రగ్యా జైశ్వాల్..!?

ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా 2022 ని ఎండ్ చేశారు . కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు . కాగా గత ఏడాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు . మరికొన్ని జంటలు పిల్లల్ని కన్నేసి హ్యాపీగా తమ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . కాగా కొత్త సంవత్సరం స్టార్టింగ్ లోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి నిర్ణయించుకుంది అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రగ్యా జైశ్వాల్ ఈ పేరుకు ప్రత్యేక పరిచేయాల అవసరం లేదు.

కుందనపు బొమ్మ అంటూ టాలీవుడ్లో ట్యాగ్ చేయించుకున్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది . అయితే తన నటనకు తగ్గ గుర్తింపు అందుకోలేకపోయింది . రీజన్ ఏంటో తెలియదు కానీ ప్రగ్యా జైశ్వాల్ నటించిన సినిమాలన్నీ పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఆమె నటనకు మాత్రం పాజిటివ్ రివ్యూస్ అందుకోలేకపోయింది . ఈ క్రమంలోనే బాలయ్యతో అఖండ సినిమాలో నటించి క్రేజీ హిట్ను తన ఖాతాలో వేసుకుంది . ఆఫ్ కోర్స్ బాలయ్య అలాంటి స్టార్ హీరోతో నటించిన ప్రగ్యా జైశ్వాల్ అవకాశాలు అందుకోలేకపోయింది .

ఈ క్రమంలోని సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ జనాలకు మరింత దగ్గరైన ప్రగ్యా జైశ్వాల్.. త్వరలోనే తన చిన్ననాటి ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కొత్త సంవత్సరంలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ప్రగ్యా జైశ్వాల్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ప్రగ్యా జైశ్వాల్ ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. చూడాలి మరి అందరిలాగ ప్రగ్యా జైశ్వాల్ కూడా మెడలో తాళ్ళి పడ్డాక భర్తని పరిచయం చేస్తుందో.. లేదో ముందుగానే జనాలకు , అభిమానులకు తన కాబోయే భర్తను ఇంట్రడ్యూస్ చేస్తుందో..?