RC -15 సినిమా కూడా మరొక సంక్రాంతికేనా..?

మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC -15వ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. RRR సినిమాతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ ను చవిచూసింది. అయితే ఈ ఏడాది ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా సంబంధించి అప్డేట్ విషయంలో మాత్రం చిత్ర బృందం చాలా ఆలస్యంగా వ్యవహరిస్తోంది.

BJP obstructs Ram Charan's RC 15 movie shooting in Hyd
RC -15 చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో విడుదల చేయాలని అనుకున్నారట. అనుకోకుండా శంకర్ భారతీయుడు -2 సినిమాని మళ్లీ మొదలు పెట్టడంతో ఈ పరిస్థితులన్నీ మారిపోయినట్లుగా తెలుస్తోంది. ఇండియన్ -2 సినిమా ఈ ఏడాది జూన్లో రాబోతున్నట్లు సమాచారం. ఇక నిర్మాత దిల్ రాజు కూడా రామ్ చరణ్ సినిమాని ఇదే ఏడాదిలో విడుదల చేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ఇండియన్ -2 షెడ్యూల్ ని బట్టి రామ్ చరణ్ వాయిదా వేసుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్లో రామ్ చరణ్ సినిమా విడుదలయ్య అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇక అప్పటికి కుదరకపోతే ఇక 2024 సంక్రాంతికి విడుదల కావచ్చు అనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇక రాంచరణ్ పుట్టినరోజు మార్చి-27 వ రోజున మాత్రమే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వస్తే కానీ పూర్తి సమాచారం తెలియదని తెలుస్తోంది. మరి ఈ సినిమా పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన చిత్రాలని తెరకెక్కిస్తూ ఉన్నారు.