ఇంట్రెస్టింగ్: మిగతా హీరోలకు .. సూర్య కు మధ్య ఉన్న బిగ్ డిఫరెన్స్ ఇదే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎలా తయారయ్యిందో మనందరికీ తెలిసిందే . బూతు సినిమా ..బూతు క్లిప్స్ ఉంటేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏ హీరో అయిన డైలాగ్ చెప్పినప్పుడు బీప్ సౌండ్ పడిందంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని నమ్మేస్తున్నారు డైరెక్టర్లు. అందుకే తమ సినిమాలో అలా వల్గర్ గా ఉండే డైలాగ్స్ ను వల్గర్ గా ఉండే సీన్స్ ను తెరకెక్కించి సినిమా అడ్డదారిలో విజయం సాధించేలా ప్లాన్ చేసుకుంటున్నారు .

నేటి యువత అలాంటి డైలాగ్స్ బాగా ఇష్టపడుతూ ఉండడంతో పలువుడ్ స్టార్ సీనియర్ హీరోస్ కూడా అదే రూట్లోకి వెళ్తూ తమ సినిమాలను విజయం దక్కించుకునేలా చేస్తున్నారు . అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మాత్రం అందుకు వ్యతిరేకం. కెరియర్ మొదట్లో మంచి కమర్షియల్ సినిమాలో నటించిన సూర్య ప్రజెంట్ తన ఫోకస్ మొత్తం కంటెంట్ ఉన్న సినిమాల పైన పెడుతున్నారు. అందుకే ఈ క్రమంలోనే జై భీమ్ ఆకాశమే హద్దురా వంటి భిన్నమైన సినిమాలను తీస్తూ అభిమానులకు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ని అందిస్తున్నారు . తన సినిమా చూసి ఒక్కరైనా మారితే చాలు అని అనుకునే విధంగా సూర్య తన సినిమా కంటెంట్ ను కథలను చూస్ చేసుకుంటున్నాడట.

ప్రజెంట్ మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో స్టార్ హీరోస్.. సీనియర్ హీరోస్ ఎవరు కంటెంట్ పై పెద్దగా ఆలోచించట్లేదు .. కమర్షియల్ గా హిట్ కొట్టామా ..నాలుగు ఐదు ఫన్నీ డైలాగులు ..రెండు మాస్ డైలాగులు కొట్టామా ..ఒక ఐటెం సాంగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చామా ..హిట్ కొట్టాము అన్న విధంగానే చూస్తున్నారు తప్పిస్తే ..మన సినిమా చూసి ప్రజలు ఏం నేర్చుకున్నారు.. ఎంత బాగుపడ్డారు అన్న విషయాన్ని పూర్తిగా వదిలేశారు. ఇదే గ్రామంలో సూర్య ఫాన్స్ మిగతా హీరోలకు సూర్యకు ఉన్న తేడా ఇదే అంటూ సూర్య పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

అంతేకాదు ఆయన భార్య జ్యోతిక కూడా సూర్యకు మంచి మంచి కథలను సెట్ చేసి పెడుతుంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కేవలం సినిమాలను మాత్రమే కాకుండా మరికొన్ని అంశాలను కూడా హీరోలు గమనిస్తూ తమ ఫ్యాన్స్ కు ఎంతో కొంత మంచి విషయాలు నేర్పిస్తే బాగుంటుంది అనేది నెటిజెన్స్ భావన. చూద్దాం మరి మిగతా హీరోలు సూర్య లాగా ఎప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తారో.. మనకు చూపిస్తారో..?