ఫైనల్లీ.. మెగా-నందమూరి ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే..!

హమ్మయ్య ..ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ ఇచ్చుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య ఎట్టకేలకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారు . కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే . సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య హీరోలుగా నటించిన సినిమాలు వూరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కన్నా ముందు సోషల్ మీడియాలో మెగా – నందమూరి ఫ్యాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు .

మా హీరో తోపు అంటే మా హీరో కత్తి అంటూ ఇద్దరు ఫ్యాన్స్ హంగామా చేశారు . పోటీ పడుతూ భారీ కటౌట్లను ఫ్లెక్సీలను థియేటర్స్ వద్ద పెట్టి నానా హంగామా చేశారు. కాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మా హీరో సినిమా హిట్ అంటే మా హీరో సినిమా సూపర్ హిట్ అంటూ అక్కడ నాన్న హంగామా చేశారు. కలెక్షన్స్ దగ్గర కూడా అంతే..మాహీరో సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని సంక్రాంతి బరిలో అసలైన విన్నర్ బాలయ్య అంటూ నందమూరి ఫ్యాన్స్ నానా హంగామా చేశారు.

వాల్తేరు వీరయ్య సినిమా టాక్ పాజిటివ్ గానే ఉన్నా నందమూరి ఫ్యాన్స్ తో కంపేర్ చేస్తే మెగా ఫ్యాన్స్ కూఇసంత సైలెంట్ అయ్యారు అనే చెప్పాలి, అయితే కలెక్షన్స్ లో మాత్రం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా నాలుగు రోజుల్లో 100 కోట్లు దాటితే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మాత్రం మూడు రోజుల్లోనే 100 కోట్లు దాటేసింది. దీంతో సంక్రాంతి రియల్ విన్నర్ గా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ విషయం ఒప్పుకోవడం నందమూరి ఫ్యాన్స్ కి కొంచెం కష్టమే అయినా వాస్తవం ఇదే కదా మరి అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు.

అయితే ఓ విషయం మాత్రం ఇక్కడ ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ ..దాన్ని సీరియస్ గా తీసుకొని హీరోల కన్నా మనం రెచ్చిపోయి కామెంట్స్ చేసి లేనిపోని గొడవల్లో ఇన్వాల్వ్ కాకూడదు అంటూ కామన్ జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ విషయం ఇప్పటికైనా అర్థం చేసుకున్న మెగా స- నందమూరి ఫ్యాన్స్ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ గానే చూస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఫాన్స్ కలిసిపోతే మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య ఇద్దరు కలిసి కూడా మల్టీ స్టార్ సినిమాలో కనిపిస్తారు. చూద్దాం ఈ ఫ్యాన్స్ ఎప్పుడు మారుతారో..? వాళ్ళను మార్చే విధంగా ఈ హీరోలు ఎప్పుడు నడుచుకుంటారో..?