అన్ స్టాపబుల్.. నుండి పవర్ టీజర్ వైరల్..!!

బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ -2 నుంచి ఎప్పుడెప్పుడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ టీజర్ ను చూసేందుకు చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. పవన్ ఎంట్రీ కూడా చాలా సాలీడ్ గానే ఉన్నట్లుగా ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది .ఇక పవన్ తో బాలయ్య చేసిన సందడి మామూలుగా లేదని చెప్పవచ్చు.

Telugu cinema actors | Twitter Topics / Twitter

ఇక బాలయ్య వేసే ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ చెప్పే సమాధానం అభిమానులను కూడా ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పవచ్చు. సినిమాలు, రాజకీయాల్లో అన్ని అంశాల పైన బాలయ్య, పవన్ మధ్య జరిగేటువంటి ప్రశ్నలతో చాలా ఫన్నీ గా ఈ ఎపిసోడ్ సాగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇక మధ్యలో పవన్ కళ్యాణ్ తన అన్న వదినల గురించి తెలియజేస్తూ ఉండడంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇలాంటి షోలకు రావడమని చెప్పవచ్చు.

చివరిలో చెప్పే బాలయ్య బ్యాడ్ బాయ్స్ డైలాగ్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ పవర్ టీజర్ వైరల్ గా మారుతోంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఏ సినిమాలను కూడా ఇప్పటివరకు పూర్తిగా చేయలేదు కేవలం హరిహర వీరమల్లు సినిమా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.