హవ్వ ..”రష్మిక ముఖం అందుకు కూడా పనికిరాదా..?” ఏంట్రా బాబు ఈ కామెంట్స్ ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నెటిజన్స్ తమ నోటికి ఎక్కువగా పని చెబుతూ హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ..పై ఏ రేంజ్ లో నెగటివ్ ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. అమ్మడు కూర్చున్న తప్పే లేచిన తప్పే.. ట్విట్ చేసిన తప్పే ట్విట్ చేయకపోయినా తప్పే .. ఏ సినిమా పైన రియాక్ట్ అయితే తప్పు రియాక్ట్ కాకపోతే తప్పు ..ఇలా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా ను ఓ రేంజ్ లో ఆటాఆడేసుకున్నారు నెటిజన్స్ .

దానికి కారణం రిషిబ్ శెట్టితో ముదిరిన వివాదం అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రష్మిక మందన అభిమానులతో కొన్ని పిక్స్ పంచుకుంది . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో రష్మిక మందన పై హ్యూజ్ రేంజ్ లో నెగటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో రష్మిక మందన నే కాదు ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ పిలవబడే రౌడీ హీరో విజయ్ దేవరకొండ పై కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ “రష్మిక మందన ఫేస్ చూడడం కూడా వేస్ట్” అని కామెంట్ పెట్టాడు . దీంతో రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . అంతేకాదు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో కూడా కొందరు ప్రముఖులు రష్మిక మందన బాలీవుడ్ కి పనికిరాదని.. ఆమె ఫేస్ బాలీవుడ్ ఇండస్ట్రీకి సెట్ కాదు అంటూ ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోని రష్మిక మందన పై నెటిజన్స్ కూడా ఇలా హద్దులు మీరి కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి చూడాలి దీనిపై రష్మిక మందన ఏ విధంగా స్పందిస్తుందో ..? నెటిజన్స్ కు ఎలా ఇచ్చిపడేస్తుందో..?