శ్రీరెడ్డి దగ్గుబాటి ఫ్యామిలీని వదిలేటట్టు లేదు… త్వరలోనే రానా గుట్టు రట్టు?

శ్రీరెడ్డి.. ఈ పేరు తెలియని వారు బహుశా తెలుగు స్టేట్స్ లో ఉండరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మడు అప్పట్లో ఫిలిం ఛాంబర్ దగ్గర చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఆ షోతోనే శ్రీరెడ్డి పేరు మీడియాలో గట్టిగా వినబడింది. అయితే సినిమాలంటే మక్కువతో అలా చేసిన శ్రీ రెడ్డి మాత్రం ఆ తరువాత సినిమాలలో ఛాన్సులు వచ్చినా చేయకపోవడం కొసమెరుపు. ఏదిఏమైనా ఈ క్రమంలో దగ్గుబాటి ఫ్యామిలీకి కాస్త డ్యామేజ్ జరిగిందనే చెప్పుకోవాలి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని సురేష్ కొడుకు, రానా తమ్ముడు అయినటువంటి అభిరాం పేరు అప్పట్లో సంచలనం అయింది.

అభిరామ్ తనను చాలాసార్లు వాడుకున్నాడని శ్రీరెడ్డి అప్పట్లో ఆరోపించిన సంగతి విదితమే. అంతేకాకుండా రామానాయుడు స్టూడియోలోనే తమకు శోభనం జరిగిందంటూ సంచలనం సృష్టించింది. ఇక అప్పటి నుంచి అభిరామ్ మీద ఎన్నో ఆరోపణలు చేస్తూ వస్తోంది. కాగా ఇప్పుడు అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో అహింస అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసినదే. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ అయినప్పుడు కూడా అట్టర్‌ ప్లాప్‌ అవుతుందని శ్రీరెడ్డి శాపనార్థాలు పెట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు రానా మీద కూడా శ్రీరెడ్డి పగ పెంచుకుందని టాక్ వినబడుతోంది.

ఎందుకంటే రానా తన తమ్ముడి మూవీని ప్రమోషన్ చేసే పనిలో పడ్డాడు. అహింస సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దాంతో సురేష్ బాబు రానాను రంగంలోకి దింపుతున్నాడు. రానాతో ప్రమోషన్ చేయించాలని యోచిస్తున్నాడు సురేష్ బాబు. అయితే ఇన్ని రోజులు రానా జోలికి వెళ్లని శ్రీరెడ్డి ఇపుడు రానా రాసలీలలు వెలికితవ్వే పనిలో ఉందట. తనను మోసం చేసిన అభిరామ్ మూవీకి సపోర్టు చేస్తున్నందుకు గాను.. రానా మూవీలకు నెగెటివ్ ప్రమోషన్ చేయడానికి రెడీ అవుతోంది. అంతే కాకుండా రానాకు సంబంధించిన సీక్రెట్లను బయట పెట్టేందుకు సిద్ధం అవుతోందంట.