బాలయ్య బ్యూటీ పై మోజు పడ్డ చిరు.. ఇక పై అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..!!

టాలీవుడ్ నందమూరి నట సిం హం బాలయ్య లేటెస్ట్ గా హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన హ్యూజ్ రేంజ్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా స్టార్ డాటర్ శృతిహాసన్ ..మలయాళ హీరోయిన్ హనీ రోజ్ నటించారు.

ఎవ్వరు ఊహించిన విధంగా హనీ రోజ్ ఈ పాత్రను సూపర్ గా డిజైన్ చేసి గోపీచంద్ మల్లినేని హనీ రోజ్ కు టాలీవుడ్ లో ఎక్కువ సినిమా అవకాశాలు వచ్చేలా చేసాడు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కొన్ని రోజులకే హనీ రోజ్ ఖాతాలో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చి పడ్డాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటే చిరంజీవి వి వి వినాయక్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమా.

యస్ ప్రజెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి – వినాయక్ కాంబోలో రాబోతున్న సినిమాలో హనీ రోజ్ -మెగాస్టార్ చిరంజీవి కు జోడిగా నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరసింహారెడ్డిలో సినిమాలో ఆమె నటన చూసిన తర్వాతే మెగాస్టార్ చిరంజీవి హనీ రోజ్ కు ఇలాంటి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే బాలయ్య టచ్ చేసిన ఏ హీరోయిన్ జాతకమైన దశ తిరగాల్సిందే అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆమె పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు..!!