కడుపుతో ఉండి ఇలాంటి పనులా..బిగ్ బాస్ బ్యూటీ మరీ టూ మచ్ చేస్తుందే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇది ఓ పెద్ద వ్యసనంలా మారిపోయింది . ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మనకు సంబంధించిన ఏ గుడ్ న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం కామన్ గా వినిపిస్తుంది . అయితే ప్రెగ్నెన్సీ బేబీ బంప్ తో ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోలను ట్రెండ్ చేయడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా ఫాలో అవుతున్నారు స్టార్ సెలబ్రిటీస్ . అంతేకాదు కామన్ పీపుల్స్ కూడా వాళ్లను చూసి అదే తంతుని ఫాలో అవుతున్నారు .

అయితే రీసెంట్గా బేబీ బంప్ తో ఉన్న ఫొటోస్ ను షేర్ చేస్తూ భర్తతో స్విమ్మింగ్ పూల్ లో ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేసింది బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ . బిగ్బాస్ హౌస్లో గడిపింది చాలా తక్కువ క్షణాలు అయినా.. తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న పూజా రామచంద్రన్ తమిళ్ లో, తెలుగులో బోలెడు సినిమాలో నటించింది. నటించిన ప్రతి సినిమాలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు చాలా తక్కువ కానీ నటన పరంగా అందరిని ఆకట్టుకుంది .

కాగా ఎవరు ఊహించిన విధంగా గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా ప్రేమించిన జాన్ కొకేను పెళ్లి చేసుకున్న పూజా..గత ఏడాది నవంబర్లో తాను గర్భవతిని అన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. పూజ రీసెంట్గా భర్తతో స్విమ్మింగ్ పూల్ లో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంది. అయితే ఈ ఫొటోస్ చూసిన జనాలు పూజా రామచంద్రన్ పై మండిపడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ లో బేబీ బంప్ తో భర్తతో లిప్ లాక్ ఏంటి ఈ పనులు..? దీని ద్వారా సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు పూజ అంటూ ఫైర్ అవుతున్నారు . మరీ ముఖ్యంగా జాన్ చంకలో ఎక్కిన పూజ అతడిపై ముద్దుల వర్షం కురిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by John Kokken (@highonkokken)