బిగ్ షాకింగ్: దొంగతనం చేస్తూ డబ్బుతో అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ..సీసీటీవీ ఫుటేజ్ వైరల్..!?

ఎస్.. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . బిగ్ బాస్ విన్నర్ సన్నీ సీసీ  ఫుటేజ్ వీడియో చూశాకా నిజంగానే సన్నీ దొంగతనం చేశాడా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం చూస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అది నిజమే అంటున్నారు జనాలు . కాగా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో బుల్లితెర నటుడుగా పాపులర్ అయిన వీజే సన్నీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ లీక్డ్ వీడియో వైరల్ అవుతుంది.

మనకు తెలిసింది బిగ్ బాస్ సీజన్ 5 లో విజే సన్ని ఎలాంటి పర్ఫామెన్స్ ఇచ్చారో. తనదైన స్టైల్ లో ఆట ఆడుతూ .. అలరిస్తూ హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు . ఈ క్రమంలోనే ఆయన క్రేజ్ రేంజ్ మరింత ఎక్కువగా మారిపోయింది . కాగా ప్రస్తుతం సినిమాల్లో తనదైన స్టైల్ లో రాణిస్తున్న బిగ్బాస్ సీజన్ 5 విన్నర్ సన్ని రీసెంట్గా దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్ అయిన వీడియో తాలూకా సిసి టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సన్నీ కారు ఓ ప్రాంతంలో ఆగుతుంది . ఆ వెంటనే కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాగుతో మళ్ళీ పరిగెత్తుకుంటూ కారువైపుగా వస్తాడు. అయితే పొరపాటున బ్యాగ్ కింద పడిపోవడంతో ..ఆ బ్యాగ్ నిండా డబ్బు ఉంటుంది . ఈ క్రమంలోని ఆ డబ్బును మరోసారి బ్యాగ్ లో వేసుకొని తిరిగి కారులో సన్నీ పారిపోతాడు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంది . ఇది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లాగా కనిపిస్తుంది. అయితే కొందరు నిజంగానే సన్నీ దొంగతనం చేశాడు అంటుంటే మరికొందరు ..కాదు కాదు తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సన్నీ ఈ విధంగా చేశాడు అంటూ చెప్పుకొస్తున్నారు . కాగా డైమండ్ రత్నబాబు డైరెక్షన్లో సన్నీ సప్తగిరి హీరోలగా అన్ స్టాపబుల్ అనే చిత్రంలో నటిస్తున్నారు . త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది . ఈ చిత్ర ప్రమోషన్స్ కోసమే సన్నీ ఇలా దొంగతనం గేమ్ ఆడుతున్నాడు అంటూ జనాలు మండిపడుతున్నారు . చూడాలి దీని పై సన్నీ ఎలా స్పందిస్తాడో..?