వెంకటేష్ పుట్టినరోజున.. చిరు ఎంత ప‌ని చేశాడో చూడండి..!

ఈరోజు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. నేటి తో 62వ వసంతంలోకి వెంకి అడుగుపెట్టబోతున్నాడు. ఆయన పుట్టిన రోజున పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ సీనియర్ హీరోలు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ తన నటనతో ఎందరో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు.

Venkatesh Daggubati: F3 has more humour and more characters | Entertainment News,The Indian Express

అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి..వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన శుభాకాంక్షలు చెప్పిన విధానం ఇప్పుడు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో.. ‘మై డియర్ వెంకీ.. హ్యాపీ బర్తడే.. వేర్ ఇస్ ద పార్టీ’..అంటూ పెట్టిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఆ పోస్టుకు ఇద్దరి హీరోల అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మెగాస్టార్ నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన సాంగ్ బాస్ పార్టీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. వెంకటేష్ ఈ పోస్ట్ పై ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.