ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు, బుల్లితెర నటి నటులు సైతం బ్యాచిలర్ లైఫ్ నుండి సరికొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది ఎంతోమంది సెలెబ్రేటీలు సైతం వివాహాలు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా మరొక నటి కూడా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.ఆమె ఎవరో కాదు కేరింత చిత్రం ద్వారా పరిచయమయ్యింది నటి సుకృతి అంబటి. కేరింత సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించిన ఈ ముద్దుగుమ్మ కేవలం ఒక్క సినిమాలోని నటించింది ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
ఈ విధంగా సుకృతి కేరింత సినిమాలో భావన పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా అనంతరం ఈమె చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత విదేశాలలో చదువు పూర్తి చేసుకున్న తర్వాత తాజాగా తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విధంగా సుకృతి , అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ లేకపోయినా తనకు సంబంధించిన విషయాలను మాత్రం అభిమానులతో అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటుంది సుకృతి.
ఈ క్రమంలో జూన్ నెలలో అక్షయ్ సింగ్ తో కలిసి నిశ్చితార్థం జరిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా తన భర్త అక్షయ సింగ్ తో కలిసి మూడు ముళ్ళు వేయించుకున్నటువంటి పెళ్లి ఫోటోలను, వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయగ ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి.దీంతో అభిమానుల సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సుకృతికి సంబంధించి పెళ్లి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram