హీరోయిన్ అంజలి సీక్రెట్ గా చేసుకుందా? ఈ ఫొటోలేమిటి.?

తెలుగు హీరోయిన్ అంజలి గురించి తెలియని తెలుగువారు వుంటారా చెప్పండి? అంజలి అచ్చ తెలుగు హీరోయిన్ అయినప్పటికీ మొదటగా ఆమెకి పేరు వచ్చింది మాత్రం అరవంలోనే. షాపింగ్ మాల్ సినిమా ద్వారా పరిచయం అయిన అచ్చ తెలుగందం అంజలి. ఆ సినిమా తమిళంతోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ హిట్ అవ్వడంతో సినిమా అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి, మెప్పించింది. ముఖ్యంగా హోమ్లీ పాత్రలతో ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంది.

ఇక ఆ మధ్య విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో జరీనా పాత్రలో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. దానికంటే ముందు అంటే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో సీత పాత్రలో నటించిన అంజలిని తెలుగు సినిమా అభిమానులను అంతత్వరగా మర్చిపోరు. ఈ సినిమా మంచి విజయవంతం కావడంతో అంజలి తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.
lo
అయితే ఈమధ్య కళలంలోనే అంజలికి ఇటు తెలుగులో, అటు తమిళంలో కూడా అవకాశాలు కాస్త సన్నగిల్లాయి. సినిమాల సంగతి కాస్త పక్కనబెడితే సోషల్ మీడియాలో అంజలి తన అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో అంజలి షేర్ చేసిన ఓ పిక్ పలు రూమర్స్ కి కారణమైంది. దాన్ని చూసిన నెటిజన్లు ఆమెకు పెళ్లైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. అంజలి ఓ అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలపై అంజలి తాజాగా క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని.. తనకు పెళ్లి ఫిక్స్ అయితే ఖచ్చితంగా చెబుతానని పేర్కొంది.