టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో సమంత కూడా ఒకరు. సమంత గడచిన కొద్దిరోజుల క్రితం నుంచి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అయితే ఈ వ్యాధి వల్ల సమంత ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి కొన్నిసార్లు కదలని పరిస్థితి కూడా తలెత్తుతుందట. ఇదే కాకుండా వీటి వల్ల వైరస్ ప్రభావం కూడా చూపిస్తుందట. ఇవి అతిగా మందులు వాడడం వల్ల కూడా వస్తుందని సమాచారం.
ఈ వ్యాధి తగ్గింపు కోసం సమంత కేరళ ఆయుర్వేద చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే సమంత ఎప్పుడైతే తనకు మయోసైటీస్ ఉందని తెలియజేయడంతో ఆ తర్వాత మరొక నటి కల్పిక గణేష్ కూడా తను కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియజేసింది. ఇప్పుడు తాజాగా రంగం సినిమాలో నటించిన హీరోయిన్ పియా బాజ్ పెమ్ కూడా ఈ వ్యాధి బాధ పడినట్లుగా తెలియజేసింది. ఈమె మాట్లాడుతూ సమంత పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను కూడా గతంలో ఈ వ్యాధి బారిన పడ్డాను చికిత్స లేని వ్యాధిబారిన పడితే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను దీని గురించి ఆలోచనలు కూడా చాలా భయంకరంగా ఉంటాయని తెలియజేసింది.
దీనిని అదుపులోకి రానివ్వాలి అంటే కేవలం మందులు మాత్రమే సరిపోతాయని తెలియజేసింది. 2016 లో ఒకసారి నా పాదంలో వాపు గమనించాను జిమ్ములో ఏదైనా దెబ్బ తగిలిందేమో అనుకున్నాను కానీ మరుసటి రోజు నిద్రలేచేసరికి మరొక పాదం కూడా వాపు వచ్చింది కూర్చోలేని పరిస్థితిలో ఇబ్బంది పడ్డాను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఈ వ్యాధి గురించి మొదట డాక్టర్ తనకు అర్థమయ్యేలా చెప్పారని తెలియజేసింది. ఆ తర్వాత మళ్లీ ఢిల్లీలో ఎయిమ్స్ కు వెళ్లి మరొకసారి పరీక్షలు చేయించుకున్నాను అక్కడ మయోసైటిస్ ఉందని నిర్ధారణ అయింది దీంతో నేను భయపడిపోయాను భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తనలో తాను కుమిలిపోయినట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.
View this post on Instagram