`వీర సింహా రెడ్డి’ వైఫ్ అంటే ఈమాత్రం ఉండాలి.. వైర‌ల్‌గా మారిన హనీ రోజ్ వీడియో!

వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగ‌బోతున్న చిత్రాల్లో `వీర సింహా రెడ్డి` ఒక‌టి. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఇందులో హీరోగా న‌టిస్తుంటే.. `క్రాక్‌` డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్, హనీ రోజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ఇందులో విల‌న్ గా చేస్తుంటే.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లూట్ చేసుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ చిత్రంలో మలయాళంలో మోస్ట్ పాపుల‌ర్ యాక్ట్రెస్ హనీ రోజ్ `వీర సింహా రెడ్డి’ భ్యార్య మీనాక్షి రెడ్డి క్యారెక్టర్ చేస్తోంది.

రోజా పువ్వు లాంటి ఈ అందమైన భామ తెలుగులో రెండు, మూడు చిత్రాలు చేసినా పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. కానీ, బాల‌య్య సినిమాలో న‌టిస్తుంద‌ని తెలియ‌గానే హ‌నీ రోజ్‌కు సూప‌ర్ క్రేజ్ ద‌క్కింది. ఇక తాజాగా ఈ భామ‌ వైట్ అండ్ ఎల్లో మిక్స్డ్ చీర‌లో అందంగా ముస్తాబై గాగుల్స్ పెట్టుకుని సూప‌ర్ స్టైలిష్‌గా వాక్ చేస్తూ వ‌స్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియోను నంద‌మూరి ఫ్యాన్స్ తెగ వైర‌ల్ చేస్తుండ‌టం విశేషం. అంతేకాదు, `వీర సింహా రెడ్డి’ వైఫ్ అంటే ఈమాత్రం ఉండాలి అని వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. మ‌రి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.

https://twitter.com/iam_kv39/status/1602558803806781440?s=20&t=qVShhDjtiGP5Iaik5lOkCA