ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. “మెగా వారసుడు రాబోతున్నాడు” ఇదే న్యూస్ మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్చేస్తూ ఇంకా పుట్టని బేబీ గురించి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ చేస్తున్నారు . కాగా గత పదేళ్లుగా మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన క్షణం నిన్న మెగాస్టార్ నుండి వినిపించింది . టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు ..తను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి .
ఈ మాట గత పదేళ్లుగా అభిమానులతో చెప్పాలని ఆశపడి చెప్పలేకపోయినా చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . ఈ క్రమంలోని మెగా ఫ్యాన్స్ సైతం తమ సొంత వదిన గుడ్ న్యూస్ చెప్పిననంత హ్యాపీగా ఆమె పేరున ట్రెండ్ చేస్తున్నారు . అంతే కాదు పెద్దలు సైతం ఉపాసనకు సోషల్ మీడియా వేదికగా బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు . ఈ క్రమంలోనే కొందరు మెగా హేటర్స్ ప్రెగ్నెన్సీ పై గతంలో ఉపాసన చేసిన కామెంట్స్ ను ట్రోల్ చేస్తున్నారు . ఆ విషయాలను ట్రెండ్ చేస్తూ మెగా అభిమానులను ఆనందపడనీయకుండా అడ్డుపడుతున్నారు .
మనకు తెలిసిందే ఉపాసన చాలా మొండి అమ్మాయి . ఉన్నది ఉన్నట్లు అనుకున్నది అనుకున్నట్లు మాట్లాడుతుంది . ఈ క్రమంలోనే చాలాసార్లు పలు మీడియా ఛానల్స్ లో మెగా వారసుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడొస్తాడు అంటూ ఆమెను విసిగించారు . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె కంట్రోల్ తప్పుతూ.. ” పిల్లలు అనేది 20 ఏళ్ళ ప్రాజెక్ట్ .. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లల్ని కనడం మంచి పద్ధతి కాదు ..పిల్లల్ని పెంచడానికి కనడానికి మానసికంగా శారీరకంగా సిద్ధం కావాలి .
ప్రపంచంలోకి మనం ఒక ప్రాణిని తీసుకురావడం అతి పెద్ద బాధ్యత ..మన పిల్లలకి ఏం కావాలి ఎలా పెంచాలి అనే విషయాలు మనకి కచ్చితంగా అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే మనం తల్లిదండ్రులు కావాలి. ఆ విషయాన్ని నేను నమ్ముతాను పిల్లలకు మంచి జీవితం ఇవ్వడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే పిల్లల్ని కంటాను “అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఇదే వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు మెగా హేటర్స్ . అయితే మెగా అభిమానులు మాత్రం ఉపాసనని ఇలాంటి వీడియోలు చూడవద్దని ప్రెగ్నెన్సీ టైంలో చాలా హెల్తీగా హ్యాపీగా కేరింగ్ గా ఉండమని సజెషన్స్ ఇస్తున్నారు . ఏది ఏమైనా సరే మెగా వారసుడు సోషల్ మీడియాని పుట్టకముందే షేక్ చేసేస్తున్నాడు.