సందీప్ కిషన్ – రెజీనా గురించి టాలీవుడ్ జనాలకి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పైలేదు. టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు వున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సందీప్ కిషన్ మొదటినుండి రెగ్యులర్ పంథాలో సినిమాలు కాకుండా చాలా డిఫరెంట్ జానర్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. మొదటి సినిమా ‘ప్రస్థానం’తోనే చాలా నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర చేసి మెప్పించాడు సందీప్ కిషన్. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
మధ్యమధ్యలో కోలీవుడ్లో కూడా సినిమాలు చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఇకపోతే టాలీవుడ్ లో హీరో – హీరోయిన్ ల జోడీలకు ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ అనేది మొదటినుండి ఉంది. ఉదాహరణకు చిరంజీవి – రాధిక, బాలకృష్ణ – విజయశాంతి, కృష్ణ – శ్రీదేవి… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జంటలు వున్నాయి. సదరు సినిమాలలో హీరో-హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడితే చాలు, వారి నుంచి మరో మూవీ ఎప్పుడొస్తుందా అని సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.
అలాగే సదరు హీరో హీరోయిన్లు మధ్య ప్రేమ ఉందని ఏదైనా మీడియా ద్వారా ప్రేక్షకులకి లీక్ అయిందంటే అది నిజమో, అబద్ధమో అని ఆలోచించకుండానే ఎవరికి తోచిన కధలు వాళ్ళు అల్లుకుంటారు. తాజాగా అలాంటి జంటకు సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వాళ్లే సందీప్ కిషన్ – రెజీనా జంట. తాజాగా పుట్టిన రోజు జరుపుకుంటున్న రెజీనాకు సందీప్ కిషన్ తనదైన రీతిలో బర్త్ డే విషెస్ చెప్పాడు. “హ్యాపీ బర్త్ డే పాప.. ఎప్పుడూ సంతోషంగా ఉండు. పుట్టిన రోజు శుభాకాంక్షాలు” అంటూ ట్విట్టర్ వేదికగా ఇద్దరు కలిసి దిగిన ఫొటోను షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.