మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ధమాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.
జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి.
`క్రాక్` తర్వాత రవితేజ మళ్లీ వరుస ఫ్లాపుల్లో మునిగిపోయాడు. అయినాసరే `ధమాకా`కు అదిరిపోయే లెవల్ లో బిజినెస్ జరుగుతోంది. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కులు అన్నీ కలుపుకుని ఏకంగా రూ. 20 కోట్లు పలికాయట. అలాగే హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో ఈ సినిమాకు రూ.10 కోట్లు వచ్చాయట. మొత్తంగా `ధమాకా` నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ. 30 కోట్ల రేంజ్ లో జరిగిందని ప్రచారం జరుగుతోంది.