మెగాస్టార్ మ‌న‌వ‌డు పేరు ఇదే… !

మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా వేళ‌ రానే వచ్చింది. మెగా అభిమానులందరికీ పండుగ లాంటి వార్త అందింది. మెగా అభిమానులు అందరూ కూడా మెగా వారసుడు కోసం 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు రామ్ చరణ్- ఉపాసన ఇప్పటికి శుభవార్త చెప్పారు. నిన్న తాజాగా చిరంజీవి తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా తాను తాతను కాబోతున్నాను అంటూ అభిమానులకు తెలియజేశారు.

Ram Charan And Upasana Becoming Proud Parents | cinejosh.com

చిరు తాత కాబోతుండడం… పైగా చిరంజీవి ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్-ఉపాసన మొదటి సంతానానికి జన్మ ఇవ్వబోతున్నారు అంటూ చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఉపాసన పేరెంట్స్ కాబోతున్నారనే వార్త బయటికి వచ్చిందో లేదో ఇప్పుడే వారికి పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు ? అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Ram Charan Become Parents, Upasana Konidela Pregnancy, Upasana Pregnancy,  Ram Charan Becomes Father, Upasana Pregnnat, Ram Charan, Upasana Konidela,  Chiranjeevi, ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ, ರಾಮ್ ಚರಣ್, Entertainment News in Kannada

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి మనవడి పేరు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. చిరంజీవి తన కుటుంబంలో ఉన్న వారసులందరికీ చివర్లో తేజ్ వచ్చే విధంగా పేరు పెట్టారు. ఈ విధంగా చూసుకుంటే రామ్ చరణ్- ఉపాసనకు పుట్టబోయే బిడ్డలకు మగ బిడ్డ అయితే అంజన్ తేజ్ అని పేరు పెట్టే అవకాశం ఉందట. ఒకవేళ ఆడబిడ్డ పుడితే అంజలి అని పేరు పెట్టాలని రామ్ చరణ్ ఉపాసన కూడా భావిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ పేరులు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మార‌యి.