తండ్రిని కాదంటూ..బాలయ్యకే ఓటు వేసిన చరణ్..మెగా ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ స్టార్ట్..!!

సోషల్ మీడియాలో ఎప్పుడూ బాలయ్య వ్స్ నందమూరి ఫైట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది . స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య చాలా క్లోజ్ గా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ మెయింటైన్ చేస్తుంటారు. అయితే వాళ్ల అభిమానులు మాత్రం కొన్నిసార్లు హద్దులు మీరుతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాగా ఈసారి కూడా అలాగే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు .

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు ఆర్సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో షూట్ కొనసాగిస్తున్నారు . ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా..మూడో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. సినిమాలోని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు దగ్గర షూట్ చేయడానికి డైరెక్టర్స్ ప్లాన్ చేస్తున్నారట. మనకు తెలిసిందే ఇదివరకే నందమూరి బాలయ్య వీరసింహారెడ్డి సినిమా లో ఇంపార్టెంట్ సీన్స్ కోసం కొండారెడ్డి బురుజు దగ్గర కొన్ని ప్లేసెస్ లో షూట్ చేశారు.

ఇదే క్రమంలో చరణ్ కూడా అక్కడే తన నెక్స్ట్ సినిమా షూటింగ్ సీన్స్ స్టార్ట్ చేయడం నందమూరి ఫ్యాన్స్ కు కీ పాయింట్ గా మారింది . ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్స్ చరణ్ ని ట్రోల్ చేస్తున్నారు. నాన్న ఐడియాలను కాదు అని బాలయ్య ఇష్టాల పౌ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావ్ కచ్చితంగా నీ సినిమా కూడా హిట్ అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు . ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరోసారి మెగా-నందమూరి టఫ్ ఫైట్ నెలకొంది . ఏది ఏమైనా సరే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ..ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మార్చేసుకున్నారు అభిమానులు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.